ఈ ఫోటో చూసి అక్కినేని అభిమానులు ఉలిక్కిపడ్డారు…ఎందుకో తెలుసా ?

స్టార్ హీరోయిన్ సమంతా స్నేహితురాలు, పాపుల‌ర్ ఫ్యాష‌న్ డిజైన‌ర్ శిల్పారెడ్డికి ఈ మధ్యనే కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే సమంత ఈ మధ్యనే శిల్పారెడ్డితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో పోస్ట్ చేసిన చాలా తక్కువ రోజులకే శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

కాకపోతే ఈ ఫోటో రీసెంట్ గా తీసుకున్నారా..లేక పాత ఫోటో ఇప్పుడు సమంతా షేర్ చేసిందా అన్నది అభిమానులకు అర్ధం కానీ ప్రశ్నగా మిగిలిపోయింది. ఫోటో తాజాగా తీసుకున్నదే అయితే శిల్పారెడ్డికి కరోనా సోకడంతో సన్నిహితంగా మెలిగిన సమంతా ఆరోగ్య పరిస్థితి ఏమిటి అని అభిమానులు కాస్త ఆందోళనగా ఉన్నారు. అయితే సమంతా ఈరోజు కూడా ధ్యానానికి సంబంధించిన ఫోటో ఒకటి ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి తనతో కలిసి ధ్యానంలో పాల్గొనాలని అభిమానులను కోరింది. దాంతో సమంత ఆరోగ్యం బానే ఉందని అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.