ధనుష్ సినిమాకు మామ రిజెక్ట్ … కారణాలు ఇవేనట…షాక్ లో ధనుష్

తమిళ ఇండస్ట్రీలో ధనుష్ హీరోగానే కాకుండా దర్శకుడిగా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. ధనుష్ దర్శకత్వంలో వచ్చిన పవర్ పాండి చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో, దర్శకుడిగా మంచి మార్కులు పడ్డాయి. ఆ ఉత్సాహంతోనే ప్రస్తుతం ‘నాన్ రుద్రన్’ అనే భారీ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా గురించి చర్చ నడుస్తోంది. ఈ చిత్రంను వంద కోట్లకు మించిన బడ్జెట్ తో తెరకెక్కించాలనుకున్నాడు. సినిమాలో కీలక పాత్ర కోసం రజినీకాంత్ ను అనుకున్నాడు.

నాన్ రుద్రన్ కథ విన్న రజినీకాంత్ చాలా బాగుందన్నాడట. అయితే తన వయసు రీత్యా , ఆరోగ్యం దృష్ట్యా తాను ఆ పాత్రను చేయలేను అని సున్నితంగా రిజెక్ట్ చేసాడట.ఈనేపధ్యంలో బడ్టెట్ కుదించి, రజినీకాంత్ అనుకున్న పాత్రను నాగార్జునతో చేయించేందుకు ధనుష్ రెడీ అవ్వడం, కొన్నాళ్ల క్రితం సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అవ్వడం కూడా జరిగిపోయింది. నాగార్జున కూడా చిత్రీకరణలో పాల్గొనబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. ఇంతలోనే మహమ్మారి కరోనా చుట్టుముట్టడంతో మొత్తం సీన్ రివర్స్ అయింది.

మరోవైపు ఈ చిత్రంలో నాగార్జున మొదట్లో ఒప్పుకున్నాడు. కాని ఇప్పుడు ఆ పాత్రకు నాగార్జున సిద్దంగా ఉన్నాడా లేడా అనేది క్లారిటీ లేదు. తనాన్ రుద్రన్ సినిమాలో ధనుష్ తో పాటు రజినీకాంత్ నటిస్తేనే బాగుంటుందనే అభిప్రాయం తమిళ ఆడియన్స్ నుంచి బలంగా వినిపిస్తోంది. కాని రజినీకాంత్ మాత్రం ఆసక్తి చూపడం లేదు. స్క్రిప్ట్ లో మార్పులు చేసి ఆయన ఆరోగ్యంకు అనుగుణంగానే పాత్రను డిజైన్ చేస్తే బాగుంటుందేమో అని ఫాన్స్ అంటున్నారు. ఇవన్నీ ఎందుకులే అని ధనుష్ మాత్రం ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసాడని టాక్.

error: Content is protected !!