సముద్రఖని కి ఆర్ ఆర్ ఆర్ యూనిట్ ఎంత ఇస్తోందో తెలుసా ?

నేషనల్ అవార్డ్ విన్నర్ సముద్రఖని ప్రస్తుతం రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమాలో ‘కటారి’ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నాడు. కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ సినిమాలో కూడా నటిస్తున్నాడు. అంతేకాదు,బాహుబలి తరువాత ఎస్ ఎస్ రాజమౌళి తీస్తున్న మల్టీస్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ లో కూడా నటిస్తున్నాడు. డైరెక్టర్ గా యాక్టర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ గా మల్టీటాలెంట్ చూపిస్తున్న సముద్రఖని తెలుగులో మొదటగా మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ‘శంభో శివ శంభో’లో చిన్న పాత్రలో కనిపించాడు. ఈ చిత్రం తెలుగు, తమిళ వెర్షన్ లకు ఆయనే దర్శకుడు కావడం విశేషం.

ఆ తర్వాత ‘రఘువరన్ బి టెక్’, ‘వి ఐ పి’ చిత్రాల్లో ధనుష్ తండ్రిగా నటించి తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించాడు. ఇక ఈ ఏడాది రిలీజైన అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అల వైకుంఠపురంలో’ సినిమాలో అప్పలనాయుడు అనే నెగటివ్ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నాడు. అయితే భారీ మల్టీస్టారర్ గా రూపొందుతున్న ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాలో స్టార్ హీరోలు ఎన్టీఆర్ – చరణ్ నటిస్తుండగా బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా నటిస్తున్నారు.

సముద్రఖని రెమ్యూనరేషన్ గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం ఈ ‘విసరణై’ యాక్టర్ కి ఏకంగా 2 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ గా ముట్టజెప్పినట్లు టాక్. ‘ఆర్.ఆర్.ఆర్’ కోసం బల్క్ డేట్స్ కేటాయించిన ఈ టాలెంటెడ్ యాక్టర్ కి 2 కోట్లు ఇవ్వడం న్యాయమని మేకర్స్ భావించారట. అంతేకాకుండా తమిళ్ మార్కెట్ పరంగా కూడా సముద్రఖని ‘ఆర్.ఆర్.ఆర్’కి ప్లస్ అవుతాడని చిత్ర యూనిట్ భావించింది. అయితే సముధ్రఖని కి అంత మొత్తంలో పారితోషకం ఇవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారినప్పటికీ అధికారిక ప్రకటనైతే మాత్రం ఇంకా రాలేదు.