వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా “వెంకీ మామ” ఎప్పుడో తెలుసా ?

విక్టరీ వెంకటేష్ మరియు నవ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య కాంబినేషన్ లో వచ్చిన వెంకీ మామ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజ జీవితంలో మామ అల్లుళ్ళు అయినా వెంకటేష్,నాగ చైతన్య ఈ సినిమాలో కూడా మామ అల్లుళ్లుగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

రాశీ ఖన్నా మరియు పాయల్ రాజ్ పుత్ లు హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు.జెమినీ ఛానెల్లో ఈ చిత్రం అతి త్వరలో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా టెలికాస్ట్ అయ్యేందుకు సిద్ధంగా ఉందని సమాచారం. ఈ సినిమా కోసం వెంకటేష్,నాగ చైతన్య అభిమానులు ఎదురు చూస్తున్నారు.