మెగా హీరో కోసం పూరి త్యాగం చేస్తున్నాడా…?

మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు అల్లు వెంకటేష్ (బాబీ) నిర్మాతగా, మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా ప్రస్తుతం ఓ సినిమా తీస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో కిరణ్ కుమార్ కొర్రపాటి దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. శాండిల్ వుడ్ స్టార్ హీరో ఉపేంద్ర కీలక పాత్రలో నటించ బోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో కఠినమైన వర్కౌట్స్ చేసి మంచి ప్రొఫెషనల్ బాక్సర్ ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తూ వచ్చాడు. ఇప్పటికే వైజాగ్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. అయితే లాక్ డౌన్ కారణంగా చిత్రీకరణ వాయిదా వేసుకున్నారు. ఇటీవలే ఈ సినిమా కోసం వరుణ్ మళ్ళీ పనులు స్టార్ట్ చేస్తున్నాడట.

అయితే ఈ సినిమాకి ఒక క్యాచీ టైటిల్ పెట్టాలని, ముఖ్యంగా స్టోరీ నేపథ్యానికి సరిపడేలా ఈ సినిమాకి ‘ఫైటర్’ లేదా ‘బాక్సర్’ అనే టైటిల్స్ అనుకున్నారట. అయితే ఈ రెండు టైటిల్స్ ఆల్రెడీ పూరీ అండ్ టీమ్ విజయ్ దేవరకొండ సినిమా కోసం రిజిస్ట్రేషన్ అయిపోయిందట. ఎందుకంటే ఆ సినిమా కూడా ఫైటింగ్ బ్యాగ్ డ్రాప్ తో ఉండబోతుందట. పైగా ఇటీవల ప్రొడ్యూసర్ ఛార్మీ ‘ఫైటర్’ అనే టైటిల్ కేవలం వర్కింగ్ టైటిల్ అని.. ఈ సినిమా కి యాప్ట్ టైటిల్ మరొకటి ఫిక్స్ చేస్తున్నట్లు, త్వరలో నే టైటిల్ అనౌన్స్ చేస్తామని ప్రకటించారు.

దీంతో వరుణ్ తేజ్ సినిమా కి ఒక ‘ఫైటర్’ అనే టైటిల్ ఒక ఛాయస్ గా మారింది. అయితే పూరీ జగన్నాథ్ ఈ ‘ఫైటర్’ టైటిల్ వరుణ్ తేజ్ కోసమే త్యాగం చేశాడని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. పూరీ – వరుణ్ తేజ్ కలిసి గతం లో ‘లోఫర్’ సినిమా కి వర్క్ చేశారు. ఈ క్లోజ్ నెస్ తో ఈ టైటిల్ కోసం వరుణ్ అండ్ టీమ్ సంప్రదించారని.. అందుకోసమే పూరీ తన సినిమాకి మరో టైటిల్ చూసుకున్నారని అనుకుంటున్నారు. ఒకవేళ ఇవన్నీ రూమర్స్ అనుకున్నా ‘ఫైటర్’ టైటిల్ కోసం ఇప్పుడైనా పూరీని వరుణ్ తేజ్ కలుస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది.