రాధ కూతురు కార్తీక గురించి ఎవరికీ తెలియని నిజాలు..ఏమి చేస్తుందో తెలుసా ?
అన్ని రంగాల మాదిరిగా సినిమా రంగంలో కూడా వారసత్వం బలంగానే నడుస్తోంది. అగ్ర నటీనటుల వారసులుగా హీరోలు, హీరోయిన్స్ కూడా వస్తున్నారు. కమెడియన్స్ ,డైరక్టర్స్ వారసులు సైతం వస్తున్నారు. తమ తండ్రి,తల్లి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని వారసులు కూడా తమ టాలెంట్ తో దూసుకెళ్తున్నారు. కొందరు ఫేడవుట్ అవుతున్నారు. అదేవిధంగా ఒకప్పటి స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక నాయర్ కూడా ఎంట్రీ ఇచ్చింది.
ఎంట్రీ అయితే ఇచ్చింది కానీ అనుకున్న స్థాయిలో కార్తీక సక్సెస్ కాలేదు. అందుకే దూరంగా ఉంది. నిజానికి ఈమె 1992జూన్ 27న రాధ, రాజశేఖరన్ నాయర్ దంపతులకు జన్మించింది. కార్తీకకు తమ్ముడు విఘేశ్వర నాయర్, చెల్లి తులసి నాయర్ ఉన్నారు. ముంబయిలో చదివిన ఈమె బిజినెస్ కోర్సు చేసింది. ఇక నటన అంటే కూడా ఇష్టం వుంది. తల్లి రాధ,పెద్దమ్మ అంబికా కూడా నటులే కావడంతో చదువుకుంటున్న సమయంలోనే మోడలింగ్ వైపు మళ్లింది.
మోడలింగ్ చేస్తున్న సమయంలో అక్కినేని నాగచైతన్య హీరోగా వచ్చిన జోష్ మూవీ తో టెలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. అది కాస్తా హిట్ కాకపోవడంతో ఏడాది గ్యాప్ తర్వాత రంగం మూవీతో వచ్చి, హిట్ అందుకుంది. దాంతో ఛాన్స్ లు వచ్చినా హిట్స్ మాత్రం పెద్దగా దక్కలేదు. జూనియర్ ఎన్టీఆర్ తో దమ్ము సినిమాలో ఛాన్స్ కొట్టినా హిట్ రాలేదు. మలయాళంలో అలాగే భారతీరాజా డైరెక్షన్ లో తమిళంలో సినిమాలు చేసింది. కన్నడ బృందావనం మూవీ చేసిన ఈమె, బ్రదర్ ఆఫ్ బొమ్మాళిలో తెలుగులో కనిపించింది. తర్వాత గ్యాప్ తీసుకుని 2015లో మరో సినిమా చేసింది. తరవాత హిందీ సీరియల్ లో చేసింది. అయితే నటనలో మరిన్ని మెలకువలతో అలరించడానికి రెడీ అవుతోంది. చూద్దాం ఎలా ఆదరణ పొందుతుందో.