ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఒక ఊపు ఊపిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…?
లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా ద్వారా రకరకాల పిక్స్ తో అభిమానులకు స్టార్స్ దగ్గరవుతూనే ఉన్నారు. అయితే హీరోయిన్ పాయల్ రాజపుట్ మాత్రం పిల్లో అడ్డు పెట్టుకుని దిగిన ఫోటో అలాగే పేపర్ డ్రెస్ వేసుకొని దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దానిపై ఎన్నో ట్రోల్ల్స్ కూడా వచ్చాయి. సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్‌గా ఉన్న సెలబ్రిటీలలో ఒకరుగా ఈ అమ్మడు ముద్రపడింది ఇంతకీ ఈ అమ్మడు ఎవరంటే, వెంకీ మామ, డిస్కో రాజా మూవీస్ లో నటించింది. నిజానికి గతంలో కొన్ని సినిమాల్లో చేసినప్పటికీ ఆర్ఎక్స్ 100 చిత్రం ద్వారా తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.
ఆర్ఎక్స్ 100 అనే ఈ ఒక్క సినిమాతో తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది ..దీంతో యూత్ లో పాయల్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఈ మూవీలో వేసిన రోల్ ఇందు గానే నేటికీ పాయల్ ను గుర్తిస్తున్నారంటే ఆ పాత్ర ఎంతగా ప్రేక్షకుల మదిలో ముద్ర వేసుకుందో చెప్పక్కర్లేదు. అయితే తాజాగా 12 వ తరగతి చదువుతున్నప్పటి ఫోటో ఒకటి పాయల్ పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఎంత క్యూట్ గా ఉందో లుక్ అని కామెంట్స్ వస్తున్నాయి.
తరచూ పాయల్ రాజ్‌పుత్ తన ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే ఈసారి తన ప్లస్ 2 రోజులలో తీసిన చిత్రంతో రావడంతో బాగా ఆకట్టుకుంటోంది. పాయల్ ఈ చిత్రంలో పింక్ సల్వార్ లో పక్కింటి అమ్మాయి లా కనిపిస్తోంది. ఇక గత కొన్ని రోజులుగా పాయల్ రాజ్‌పుత్ రెండు ‘స్పెషల్ సాంగ్స్’లో నటించబోతుంది అనే వార్త వైరల్ అవుతుంది. అల్లు అర్జున్ “పుష్ప” , అలాగే భారతీయుడు సీక్వెల్ లో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది అనే వార్త వైరల్ అయ్యింది. దీనిపై పాయల్ స్పందించి …అవి ఉత్తి పుకార్లే అని తేల్చేసింది.