కర్తవ్యం సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో
లేడి అమితాబ్ బచ్చన్ గా పేరొందిన విజయశాంతి గ్లామర్ పాత్రలతో అలరిస్తూనే మరోపక్క లేడీ ఓరియెంటెండ్ పాత్రలతో ఆడియన్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ కూడా అందుకుందని అంటారు. అయితే ప్రతిఘటన,కర్తవ్యమ్ వంటి సినిమాలు చూస్తే,పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ మూవీస్. ఈ రెండు సినిమాలు ఎంతటి అందుకున్నాయో చెప్పక్కర్లేదు. 1990వ దశకంలో ఆమె చేసిన సినిమాలు టాప్ రేంజ్ కి చేరాయి.
ఏ మోహన్ గాంధీ డైరెక్షన్ లో 1990లో వచ్చిన కర్తవ్యమ్ మూవీలో విజయశాంతి నటనకు ఆడియన్స్ బ్రహ్మరధం పట్టారు. ఏ ఎం రత్నం నిర్మించిన ఈ మూవీని తొలి ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని తెరెకెక్కించారని అంటారు. అవార్డు వచ్చిన ఆఫీసర్ గా నిల్చి,సెకండాఫ్ లో కదల్లేని స్థితికి విలన్స్ తెచ్చినప్పటికీ మొక్కవోని దీక్షతో ఎదిరించి నిలబడ్డ నటన హైలెట్. నిజంగా అమ్మాయిలను పోలీసు ఉద్యోగాలవైపు మళ్లించడంలో ఈ సినిమా కీలకంగా నిలిచిందని అనేవారు
సమాజంలో జరిగే అన్యాయాలు,దురాగతాలను ఓ మహిళా పోలీసాఫీసర్ ఎదురొడ్డి పోయడం చేయడమే ఈ సినిమా ఇతివృత్తం. క్లాస్ ,మాస్ అనే తేడాలేకుండా అందరిని మెప్పించిన సినిమా ఇది. రాజ్ కోటి సంగీతం సూపర్భ్. హీరోయిన్స్ కూడా ఒళ్ళు గగుర్పొడిచేలా ఫైట్స్ చేయవచ్చని నిరూపిస్తూ, విజయశాంతి చేసిన నటనతో పాటు అట్లూరి పుండరీకాక్షయ్య విలన్ గా మెప్పించిన తీరు, వినోద్ కుమార్, చరణ్ రాజ్ నటన అదిరిపోయాయి. పరుచూటి బ్రదర్స్ రచించిన ఈ సినిమాలో పరుచూరి వెంకటేశ్వరరావు, నూతన ప్రసాద్, సాయికుమార్ ఇలా అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక హిందీలో వైజయంతి ఐపీఎస్ పేరుతొ రీమేక్ చేయగా సక్సెస్ అందుకుంది.