కోకిల సినిమా గురించి ఎవరికి తెలియని నమ్మలేని నిజాలు… వెంటనే చూడండి

కమర్షియల్ సబ్జెక్ట్స్ తో ఇండస్ట్రీ నడుస్తున్న రోజుల్లో హీరోనరేష్, నటి శోభన జంటగా డైరెక్టర్ చేసిన ప్రయోగమే కోకిల మూవీ. నిజానికి నాగార్జునతో సంకీర్తన చేసి డిజాస్టర్ మూటగట్టుకున్న గీతా కృష్ణ ఓ నిజజీవిత ఘట్టాన్ని ఎత్తుకుని సాహసోపేతంగా కోకిల మూవీ అది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ లో తెరేక్కించి హిట్ కొట్టాడు. ఓ పేరున్న స్వామిజి హత్య చేయబడడం,అప్పటికే కళ్ళను పోగొట్టుకున్న సిద్ధార్ధ (నరేష్)కి స్వామిజి కళ్ళను అమర్చడం జరుగుతాయి.

అయితే అసలు కథ అక్కడనుంచే ఎన్నో మలుపులు తిరుగుతుంది. కళ్ళు తెరిచేసరికి ఆ మర్డర్ కళ్లెదుట కనిపించి తాత్కాలికంగా మళ్ళీ చూపు పోతుంది. ఇక స్వామీజీని హత్యచేసిన వాళ్ళు కోకిల (శోభన)కు ఫోన్ చేసి బెదిరించడం స్టార్ట్ చేస్తారు. అయితే స్వామిజి హత్యను డీల్ చేయడానికి వచ్చిన సిబిఐ ఆఫీసర్ శరత్ బాబు కోకిలకు బాసటగా నిలబడతాడు.

ఆతర్వాత సిద్ధార్థకు ఏమైంది, కేసు ఎలా మెరుపు తిరుగుతుంది వంటివన్నీ ఏంటో ఉత్కంఠను రేపుతాయి. ఎన్నో మలుపులు గల ఈ సినిమాకు రైటర్ ఎల్బీ శ్రీరామ్ కి కూడా ఇదితోలి మూవీ. ఓ పాటలో ఇళయరాజా ఫోటో పెట్టి షూట్ చేయడం కూడా బాగా ఆకట్టుకుంది. విలన్ ఎవరో చివరివరకూ తెలీదు. విలన్ గా సాయికుమార్ ఇచ్చిన డబ్బింగ్ టాప్. రంగనాధ్,కోట శ్రీనివాసరరావు,స్వీయకృష్ణ,నాజర్,వంటివాళ్ళు నటన బాగుటుంది. ఇళయరాజా మ్యూజిక్ సూపర్భ్. శోభన్ నటన అదుర్స్. నరేష్ చాలావరకూ అంధుడిగానే ఉంటాడు.