Movies

ఎన్టీఆర్, దాసరి కాంబినేషన్ లో వచ్చిన ‘బొబ్బిలి పులి’ గురించి నమ్మలేని నిజాలు

ఎన్నో సినిమాలు వస్తాయి,కొన్ని బ్లాక్ బస్టర్,కొన్ని సూపర్ హిట్,మరికొన్ని డిజాస్టర్ అవుతాయి. కానీ ఎప్పటికీ సంచలనంగా నిలిచే సినిమాగా తెలుగు వారి చరిత్రలో నిలిచిపోయే సినిమా ఒకటి ఉంది. అదే బొబ్బిలి పులి. ఈ సినిమా షూటింగ్ మొదలు రిలీజ్,ఆయా కేంద్రాల్లో ఆడడం వరకూ అన్నీ సంచలనమే. ఎన్టీఆర్ పార్టీ పెట్టడానికి, అధికారంలోకి రావడానికి దోహదపడ్డ సినిమా. అవును తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్, దాసరి నారాయణ రావు టాలీవుడ్ సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్ల కలయికలో వచ్చిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి.

అందులో వీరిద్దరి కలయికలో వచ్చిన ఐదో చిత్రం, చివరి చిత్రం కూడా ‘బొబ్బలి పులి’. విజయ మాధవి కంబైన్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ మూవీలో ఎన్టీఆర్ కి జోడిగా శ్రీదేవి నటించింది. అప్పట్లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిల్చిన ‘బొబ్బిలిపులి’ విడుదలై 38 ఏళ్లు పూర్తైయింది. ఇండస్ట్రీలోనే ఈ మూవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది.

ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు జేవి రాఘవులు అద్భుతమైన సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలన్ని సూపర్ హిట్. బొబ్బిలి పులి విడుదలకు ముందు రాజకీయాల్లోకి వస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించి తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఇక ఎన్టీఆర్ ఎన్నికల ప్రచార సమయంలో ఉండగా, ఈ మూవీ విడుదలై సంచలన విజయం సాధించింది. ఓ విధంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ‘బొబ్బిలి పులి’ చిత్రం కీ రోల్ ప్లే చేసింది. 39 కేంద్రాల్లో 100 రోజులు పైగా నడిచింది.