నిర్మాతగా ఎంట్రీ ఇస్తున్న స్టార్ హీరో చెల్లెలు…ఎవరో చూసేయండి

బాహుబలి తర్వాత చేసిన సాహు అనుకున్న రేంజ్ కి చేరకపోవడంతో ఓ కొత్త ట్రెండ్ తో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ వలన 70శాతం మాత్రమే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్‌ తాజాగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమా ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.ఇక ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ పూర్తి పీరియాడికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది.

ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసి మరోసారి ప్రభాస్ తన సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పరిశీలిస్తే ఓ కొత్త పేరు మనకు కనిపిస్తుంది.రాధేశ్యామ్ తెలుగు పోస్టర్‌లో ప్రసీధ అనే పేరు ఉంది.ఇంతకీ ఈ ప్రసీధ ఎవరు అనే ప్రశ్న అందరిలో కలుగుతోంది.ప్రభాస్ పెద్దనాన్న కృష్ణం రాజు కుమార్తెనే ఈ ప్రసీధ అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు.

మొత్తానికి రాధేశ్యామ్ చిత్రంతో నిర్మాతగా మారుతున్న ప్రభాస్ సోదరి, ఎలాంటి సక్సెస్‌ను అందుకుంటుందో చూడాల ని ఫాన్స్ అంటున్నారు రాధేశ్యామ్ చిత్రాన్ని గోపీకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రసీధ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న నిర్మాతల్లో ఒకరుగా ఎంట్రీ ఇస్తోంది. నిజానికి గతంలోనూ ప్రభాస్‌కు చెందిన కొన్ని ఈవెంట్స్‌ను ఆమె చూసుకునేది.ఇప్పుడు ఇలా పోస్టర్‌పై ఆమె పేరు రావడంతో టాలీవుడ్‌లో నిర్మాతగా మారేందుకు ఆమె రెడీ అవుతున్నట్లు తేలింది.