Movies

కెరీర్లో తొలిసారిగా మెగా మేనల్లుడు డిఫరెంట్ రోల్….సక్సెస్ అవుతాడా…రిస్క్ చేస్తున్నాడా…?

మెగా కాంపౌండ్ నుంచి చాలామంది హీరోలు వచ్చారు .. ఇంకా వస్తున్నారు. అయితే తమ టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలబడడానికి ఎవరికివాళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే బన్నీ, మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ లాంటివాళ్లు హిట్స్ దూసుకెళ్తున్నారు. అయితే మెగా మేనల్లుడు సాయి ధర్మ తేజ్ కూడా సరైన బ్రేక్ కోసం చూస్తున్నాడు.

వరుసగా ప్లాప్ లు వెంటాడటంతో సాయితేజ ప్రతి రోజు పండగే మూవీతో హిట్ కొట్టాడు. సుబ్బు డైరెక్షన్ లో ‘సోలో బతుకు సో బెటర్’ మూవీ చేస్తున్న యితడు ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పటికే ఇందులో విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. ఇక దేవా కట్టా డైరెక్షన్ లో కూడా ఆసినిమా చేయడానికి సాయితేజ ప్లాన్ చేస్తున్నాడట.

వెన్నెల, ప్రస్థానం,ఆటోనగర్ సూర్య వంటి మూవీస్ మంచి పేరుతెచ్చుకున్న దేవా కట్టా తో ప్లాన్ చేసిన సినిమాలో ఓ కీ రోల్ చేయబోతున్నాడట. పైగా అది ఓ ఐ ఏ ఎస్ ఆఫీసర్ రోల్ అని అంటున్నారు. అందుకు తగ్గట్టు బాడీని మెయింటేన్ చేస్తున్నాడు. సమాజానికి సందేశం ఇచ్చేలా ఉండే ఈ పాత్ర వలన ఫాన్స్ లో కూడా మంచి ఫాలోయింగ్ వస్తుందని టాక్. అంతేకాదు కెరీర్ లో ఎప్పుడూ ఇలాంటి రోల్ చేయకపోవడంతో ఇది నిజంగా డిఫరెంట్ గా ఉంటుందట.