Movies

పవన్ కళ్యాణ్ కెరీర్ లో సినిమాల బడ్జెట్,కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి బ్రదర్ గా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో ఇండస్ట్రీలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్నాడు. హిట్ ,ప్లాప్ లతో పనిలేకుండా ఫాన్స్ అనుసరించే హీరోలలో పవన్ అగ్రస్థానంలోనే ఉంటాడు. అంతలా అభిమానుల ప్రేమను సొంతంచేసుకున్నాడు. 1996లో అక్కడ అమ్మాయి,ఇక్కడ అబ్బాయి సినిమాతో ఎంట్రీ ఇచ్చాడు. అక్కినేని మనవరాలు హీరోయిన్. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ యావరేజ్ గా నిల్చింది. రెండు కోట్లు ఖర్చుచేస్తే, 2.7కోట్లు వచ్చింది. తర్వాత రాశి హీరోయిన్ గా గోకులంలో సీత మూవీ చేసాడు. 3కోట్లు ఖర్చుపెడితే నాలుగు కోట్ల దాకా వచ్చింది. 1998లో వచ్చిన సుస్వాగతం పవన్ కెరీర్ ని మార్చేసింది. 3.2కోట్ల బడ్జెట్ పెడితే ఆరుకోట్ల వరకూ వచ్చింది.

ఆతర్వాత తొలిప్రేమ మూవీ పవన్ కి యూత్ లో క్రేజ్ పెంచింది. 4.6కోట్లు ఖర్చుచేస్తే,10కోట్లకు పైనే వసూలుచేసి బ్లాక్ బస్టర్ అయింది. 1999లో వచ్చిన తమ్ముడు మూవీ మంచి హిట్ కొట్టింది. 6కోట్లు ఖర్చుచేస్తే,11కోట్లకు రాబట్టింది. ఇక 2000లో వచ్చిన బద్రీ పవన్ కెరీర్ ని పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. పూరి జగన్నాధ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ 10కోట్లతో తీస్తే,22కోట్లు కలెక్షన్ వచ్చింది. ఆతర్వాత ఖుషి సినిమా మరో బ్లాక్ బస్టర్ కొట్టింది. 15కోట్లు బడ్జెట్ పెడితే 24కోట్లకు పైగా సాధించింది. 2003లో జానీతో తనకు తానే డైరెక్షన్ చేసుకుని వదిలిన జానీ సినిమా నిరాశ పరిచింది. 20కోట్లతో తీస్తే, 9కోట్లు మాత్రమే వచ్చింది. ఆతర్వాత గుడుంబా శంకర్ యావరేజ్. 20కోట్లు పెడితే, 18కోట్లే వచ్చాయి. ఇక 2005లో వచ్చిన బాలు యావరేజ్ గానే ఉంది. 20కోట్లు పెడితే, 23కోట్లు కలెక్ట్ చేసింది.

ఇక 2006లో వచ్చిన బంగారం మూవీ కూడా యావరేజ్ గా నిల్చింది. 16కోట్లతో తీస్తే, 24కోట్ల వరకూ తెచ్చింది. 2006లో తమిళ మూవీ ఆధారంగా వచ్చిన అన్నవరం మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు.20కోట్లకు 21కోట్లు వసూలుచేసింది. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన జల్సా దుమ్మురేపింది. పాతిక కోట్లు పెడితే, 29కోట్లకు పైనే వసూలుచేసి బ్లాక్ బస్టర్ అయింది. 2010లో వచ్చిన కొమరం పులి ప్లాప్. 30కోట్ల బడ్జెట్ కి 16కోట్లు మాత్రమే వచ్చాయి. 2013లో హిందీ రీమేక్ గా వచ్చిన తీన్ మార్ మూవీ 32కోట్లతో తీస్తే 25కోట్లు మాత్రమే వచ్చాయి.

తరవాత వచ్చిన పంజా డిజాస్టర్ అయింది. 34కోట్లకు గాను 19కోట్లే వచ్చింది. ఇలా ప్లాప్ లతో నడుస్తున్న సమయంలో వచ్చిన గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అయింది. 34కోట్లకు గాను 62కోట్లు వసూళ్లుచేసింది. కెమెరామన్ గంగతో రాంబాబు యావరేజ్. 25కోట్లకు 37కోట్లు తెచ్చింది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది మూవీ బ్లాక్ బస్టర్. తెలుగు ఇండస్ట్రీలోనే భారీ హిట్. 55కోట్ల బడ్జెట్ పెడితే 75కోట్లకు పైనే వసూలు చేసింది. అయితే తరువాత వచ్చిన గోపాల గోపాల మల్టీస్టారర్, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి ఆశాజనకంగా లేవు.