Health

గుడ్డులో తెల్లబాగం తినాలా…పసుపు భాగం తినాలా… ?

గుడ్డులో తెల్లబాగం తినాలా పసుపు భాగం తినాలా అనే సందేహం మనలో చాలామందికి ఉంటుంది. గుడ్డులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. గుడ్డు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. గుడ్డులో ఉన్న పోషక విలువలు గురించి తెలుసుకుందాం.

రెండిటి పోషక విలువలను చెక్ చేస్తే, తెల్లభాగం లో 3.6 గ్రాముల ప్రోటీన్ ఉంటే, పసుపు భాగంలో 2.7గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.అంటే తెల్లబాగం లోనే ప్రోటీన్లు ఎక్కువ.వైట్ లో కేవలం 0.05 గ్రాముల ఫ్యాట్ ఉంటే, పసుపు భాగంలో మాత్రం 4.5 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది.వైట్ లో కేవలం 16 కాలరీలు ఉంటాయి, కాని యోల్క్ లో 54 కాలరీలు ఉంటాయి.

ఎగ్ తెలుగు భాగంలో కొలస్ట్రాల్ అసలు ఉండదు. పసుపు భాగంలో 211 ఉంటుంది. ఎగ్ తెలుపు భాగంలో పొటాషియం, సోడియం, రిబో ఫ్లవిన్ ఎక్కువగా ఉంటె, పసుపు భాగంలో కాల్షియం,పాస్పరస్,జింక్, సేలేనియం, థియామిన్, ఫోలేట్, బి 12 ఎక్కువగా ఉంటాయి .ఈ లెక్కన చూస్తే ఎగ్ తెలుపు,పసుపు రెండు భాగాలు మన ఆరోగ్యానికి సహాయపడతాయి. కొలస్ట్రాల్ సమస్య ఉన్నవారు ఎగ్ తెలుపు భాగాన్ని తింటే సరిపోతుంది.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు వారం లో రెండుమూడు రోజులు మాత్రమే పూర్తీ గుడ్డుని తిని, మిగితా రోజులు కేవలం వైట్ తో కానిచ్చేస్తే మంచిది అని న్యూట్రిషన్ నిపుణులు సూచిస్తున్నారు.