వెంకటేష్ ఎత్తుకున్న టాలీవుడ్ స్టార్ ఎవరో గుర్తు పట్టారా…వెంటనే చూసేయండి

అవునా,ఎప్పుడు,ఏ మూవీ .. కొత్తగా వస్తోందా ఇలా అనుకోవడం సహజమే. సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేష్ బాబు తన టాలెంట్ తో వరుస విజయాలతో దూసుకెళ్తూ సూపర్ స్టార్ అయ్యాడు. తండ్రికి తగ్గ తనయుడు అయ్యాడు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సినీ నేపధ్యం గల మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు తనయుడిగా ఎంట్రీ ఇచ్చి, తన టాలెంట్ చూపిస్తూ విక్టరీ గా ఎదిగాడు.

ఇక వీళ్ళిద్దరూ కల్సి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో అన్నదమ్ములుగా చేసారు. ఈ సినిమా మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇక తమిళంలో విజయం అందుకున్న అసురణ్ మూవీని తెలుగులో రీమేక్ చేస్తున్న వెంకీ నటించబోతున్నాడు. ప్రియమణి హీరోయిన్ గా చేస్తోంది. సరిలేరు నీకెవ్వరూ మూవీతో విజయాన్ని అందుకున్న మహేష్ బాబు సర్కార్ వారి పాట మూవీ చేయడానికి కమిట్ అయ్యాడు.

లాక్ డౌన్ నేపథ్యంలో మహేష్ బాబుని వెంకీ ఎత్తుకున్నట్లు ఉన్న ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతూ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇంతకీ ఎప్పుడంటే, చిన్నప్పుడు మహేష్ పుట్టినరోజుకి వెంకీ హాజరయ్యాడు. ఆ సందర్బంగా తీసిన ఈ పిక్ అందరినీ ఆకట్టుకుంటోంది . ఘట్టమనేని వారసుడిని ఎత్తుకున్న దగ్గుబాటి బాసూ అంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఫాన్స్ షేర్ చేస్తున్నారు.