Beauty Tips

పెదాలు ఎర్ర‌గా, మృదువుగా మారాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అవ్వండి

పెదవులు అనేవి ఆడవారి అందాన్ని రెట్టింపు చేయటంలో కీలకమైన పాత్రను పోషిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరు పెదాలు ఎర్ర‌గా, మృదువుగా ఉండాలని కోరుకుంటారు. అది సహజం కూడా. అయితే కొంతమంది పెదాలు పొడిగా,నల్లగా మారుతూ ఉంటాయి. వీరు ఎంత అందంగా కనపడిన అందవిహీనంగా కనపడతారు. ఇప్పుడు చెప్పే టిప్స్ పాటిస్తే ఎర్ర‌గా, మృదువుగా మార‌డంతో పాటు మీ అందం కూడా రెట్టింపు అవుతుంది.

ఈ చిట్కా కోసం ఒక బౌల్ లో అరస్పూన్ తేనే తీసుకోని దానిలో పావు స్పూన్ పంచదార వేసి బాగా కలిపి ఈ మిస్రమ్మతో పెదాలకు స్క్రబ్ చేయాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే పెదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోయి మృదువుగా మారతాయి.

అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకుని ర‌సం చేసుకోవాలి.ఈ ర‌సాన్ని పెదాల‌కు రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

గులాబి రేకులను పాలలో వేసి పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌ను పె‌దాల‌కు ప‌ట్టించి పావు గంట త‌ర్వాత చ‌ల్ల‌టి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే పెద‌వులు తేమ‌గా మ‌రియు మృదువుగా ఉంటాయి.