90 సంవత్సరాల టాలీవుడ్ లో ఎక్కువ కాలం ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన సినిమా ఏది ?

ఒక సినిమా ప్లాప్ , డిజాస్టర్,యావరేజ్, హిట్,సూపర్ హిట్,బ్లాక్ బస్టర్,ఇండస్ట్రీ హిట్ ఇలా కేటగిరీలు ఉంటాయి. అయితే ఇండస్ట్రీ అంటే అన్నీ కుదరాలి. కలెక్షన్స్ రావడమే కాదు, సినిమా జనంలోకి ఎంతగా చొచ్చుకుపోయిందో కూడా చూస్తే.. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఓ మంచి కథ గల సినిమాకి కరెక్ట్ గా హీరో కుదిరితే ఇండస్ట్రీహిట్ అవుతుంది. ఒక్కోసారి హీరో లేకుండానే ఇండస్ట్రీ హిట్ కొట్టిన సినిమాలు ఉంటాయి. ఒక హిట్ మూవీని మరో హిట్ మూవీ క్రాస్ చేయడం సహజం.

కానీ ఎక్కువకాలం ఇండస్ట్రీ హిట్ దరిదాపుల్లోకి మరో సినిమా రాకపోతే చాలాకాలం ఒకే సినిమా ఇండస్ట్రీ హిట్ గా ఉండిపోతుంది. 1938లో వచ్చిన మాలపిల్ల మూవీని 1942లో బాలనాగమ్మ మూవీ క్రాస్ చేసి ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. అయితే నాలుగేళ్లపాటు ఇండస్ట్రీ హిట్ గా నిల్చిన తొలితెలుగు సినిమా మాలపిల్ల. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇంద్ర మూవీ కూడా ఇలా నాలుగేళ్లు ఇండస్ట్రీ హిట్ గా ఉంది. బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన ఇంద్ర మూవీ 2002లో వచ్చింది.

అయితే 2006లో పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన మహేష్ మూవీ పోకిరి క్రాస్ చేసింది. ఇక 2009లో రామ్ చరణ్, ఎస్ ఎస్ రాజామౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ అయింది. 2013లో పవన్ కళ్యాణ్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన మూవీ అత్తారింటికి దారేది క్రాస్ చేసింది. ఇక 1957లో వచ్చిన మాయాబజార్ ని 1963లో లవకుశ క్రాస్ చేసి ఆరేళ్ళ రికార్డ్ ని బ్రేక్ చేసి, 8ఏళ్ళు ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే 1973లో దసరా బుల్లోడు మూవీతో లవకుశను బ్రేక్ చేసింది. మొత్తానికి తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక కాలం ఇండస్ట్రీ హిట్ గా లవకుశ నిల్చింది. ఇక బాహుబలి 1700కోట్లు క్రాస్ చేసింది. దీన్ని క్రాస్ చేయడం ఏ సినిమాకైనా అసాధ్యమే.