Movies

సహస్ర సినిమా కోసం సుడిగాలి సుధీర్ ఎంత డిమాండ్ చేసాడో ?

ఈటివి జబర్దస్త్ ప్రోగ్రాంతో పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ వివిధ చానల్స్ లో ప్రోగ్రామ్స్ అదరగొడుతూ టాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. తాజాగా కాలింగ్ సహస్ర మూవీ చేస్తున్నాడు. ఓ నూతన నిర్మాణ సంస్థ నిర్మించే ఈ మూవీని అరుణ్ విక్కీరాల డైరెక్షన్ చేస్తున్నాడు.

అయితే ఈ మూవీకి సంబంధించి ఓ వార్త లేటెస్ట్ గా వైరల్ అవుతోంది. అదేంటంటే సహస్ర మూవీ కోసం భారీగానే రెమ్యునరేషన్ అందుకున్నాడట. కమెడియన్ గా అలరిస్తున్న సుధీర్ ఈ మూవీ ద్వారా కొత్త లుక్ లో కనిపించనున్నాడని కూడా వినిపిస్తోంది.

సిక్స్ ప్యాక్ గా కనిపించడానికి కసరత్తు కూడా చేస్తున్నాడు. లాక్ డౌన్ పిరియడ్ లో ఓ ఫిట్ నెస్ ట్రైనర్ ని కూడా పెట్టుకున్నట్లు ఇటీవల యాంకర్ రేష్మి గౌతమ్ ఈమధ్యే ప్రకటించింది. అయితే ఈ మూవీలో రేష్మి కూడా నటిస్తున్నట్లు టాక్ వస్తున్నా, ఇంతవరకూ ఆమె క్లారిటీ ఇవ్వలేదు.