రానా ఒక వైపు పెళ్లి…మరో వైపు ఏమి చేస్తూ బిజీగా ఉన్నాడో తెలుసా ?

కరోనా కల్లోలం లో లిమిటెడ్ మెంబర్స్ తోనే పెళ్లిళ్లు కానిస్తున్నారు. సెలబ్రిటీలు కూడా ఇదే బాటలో నడుస్తున్నారు. ఇక యువ హీరో నితిన్ పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఈనెల 26న నితిన్ వివాహం షాలినితో జరగనుంది. ఇక దగ్గుబాటి వారబ్బాయి రానా కూడా పెళ్లి కొడుకు అయ్యాడు.అయితే ఓవైపు తాను వలచిన మిహీక బజాజ్ ను పెళ్లాడేందుకు ఏర్పాట్లలో బిజీగా ఉంటూనే మరోవైపు బిజినెస్ వ్యవహారాల్ని చక్కబెడు తున్నాడు.

ఆగస్టు 8న పెళ్లి పెట్టుకుని యువహీరో రానా ఇంత బిజీ అయితే ఎలా? అనుకుంటున్నారా అవును ఇప్పటికిప్పుడు పలు భారీ పాన్ ఇండియా చిత్రాలకు పావులు కదుపుతున్నాడు. అలాగే రీమేక్ హక్కుల్ని కొనడం వాటి తెలుగు రీమేక్ లు ఎంతవరకూ వర్కవుట్ అవుతాయో రివ్యూలు చేయడం.. డైరెక్టర్ల ఎంపిక, ఇంకోవైపు డాడీ సురేష్ బాబుతో కలిసి స్క్రిప్టుల్ని తయారుచేయించడంలో మునిగిపోయాడు.

అంతటితో ఆగడంలేదు దీపం ఉండగానే ఓటీటీని క్యాష్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నాడు. ఎందుకంటే, ప్రస్తుతం ఓటీటీ ట్రెండింగ్ లో ఉన్న బిజినెస్ కదా. అందుకే ఏదీ వదిలిపెట్టడం లేదు. ఇటీవల వరుసగా పలు ఇంటర్నేషనల్ వెబ్ సిరీస్ ల రైట్స్ కొనుక్కుని వాటిని తెలుగైజ్ చేయడమే గాక ఇండియా వైడ్ మార్కెటింగ్ పైనా దృష్టి సారిస్తున్నాడట. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్.. నెట్ ఫ్లిక్స్ ప్రతినిధులతో మంతనాలు సాగిస్తున్నాడట. అలాగే సొంతంగా ఒరిజినల్ వెబ్ సిరీస్ రూపకల్పనలోనూ బిజీ. మొత్తానికి తండ్రినుంచి బిజినెస్ లక్షణాలు బానే వచ్చాయన్న గుసగుసలు విన్పిస్తున్నాయి.