అంతః పురం సినిమా వెనుక నమ్మలేని ఎవరికి తెలియని నిజాలు

డైనమిక్ డైరెక్టర్ కృష్ణ వంశీ అనగానే క్రియేటివిటీ ఉంటుంది. మొబైల్స్ లేని రోజుల్లో గులాబీ సినిమాలో కార్డు లెస్ ఫోన్ పెట్టి భలే ఉంది అనుకునేలా చేసాడు. నిన్నే పెళ్లాడతా మూవీలో ల్యాండ్ ఫోన్ తో మాట్లాడుతూ అవతలి వ్యక్తిని చూడవచ్చని ఐడియా క్రియేట్ చేసాడు. ఇలా ప్రతిసినిమాలో ఏదొక కొత్తదనం చూపిస్తూ, ఎన్నో సినిమాలతో ఎందరో హీరోలకు హిట్స్ ఇచ్చిన కృష్ణవంశీ తీసిన అంతః పురం ప్రత్యేకత వేరు. 1998లో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ మదిలో చెరగని ముద్రవేసింది. ఎన్ని ఫ్యాక్షన్ మూవీస్ వచ్చినా, అంతః పురం సాటి ఏదీ రాదు. ఎందుకంటే జగపతి బాబుతో చేయించిన పాత్ర, క్లైమాక్స్ సీన్స్ ఇప్పటికీ జనానికి గుర్తుండిపోయాయి. అంతః పురం లో లాంటి పాత్రను ప్రకాష్ రాజ్ మళ్ళీ చేయలేదు.

జొన్న సంకటి,చికెన్ తినే సీన్,జీవిని చంపే సీన్,సాయికుమార్ ఫ్యాక్షన్ గురించి ప్రకాష్ రాజ్ తో గొడవ, అక్కడి వాతావరణం ఇలా అన్నీ అంతః పురంలో మెస్మరైజ్ చేస్తాయి. ఇక సౌందర్యను గ్లామర్ గా చూపిస్తూనే కన్నీళ్లు పెట్టించేలా నటింపజేయడం మామూలు విషయం కాదు. దాసరి అరుణకుమార్ పై సాంగ్, అసలేం గుర్తుకు రాదు వంటి సాంగ్స్ హైలెట్. ఇళయరాజా మ్యూజిక్ సూపర్భ్. మాములుగా ఆంగ్ల సినిమాయో,మరో భాష చిత్రం సినిమాయో తెలుగులో రీమేక్ చేస్తుంటారు. అయితే 2006లో వచ్చిన ఇంగ్లీషు మూవీ బ్లడ్ డైమండ్ మూవీ నిజానికి అంతః పురం మూవీకి కాపీయే.

ఈ రెండు సినిమాల క్లైమాక్స్ ఒకేలా ఉంటాయి. తన బతుకుకోసం సారా వ్యాపారం చేసే పాత్రలో జగపతి బాబు చేస్తే, బ్లడ్ డైమండ్ లో డికాప్రియో తన భవిష్యత్తుకోసం వజ్రాల వేట చేస్తాడు. సౌందర్య,ఆమె పిల్లాడిని కాపాడుతూ జగపతి బాబు చనిపోతే, డికాప్రియో తన ఫ్రెండ్ ని అతడి కొడుకుని కాపాడుతూ చనిపోతాడు. సిగరెట్ తాగడంతో సహా ఈ రెండు సినిమాలకు చాలా పోలికలున్నాయి. అయితే నాట్ విత్ అవుట్ మై డాటర్ అనే సినిమాకు అంతః పురం మూవీ స్ఫూర్తి గా కూడా చెబుతారు. కానీ జగపతి బాబు లాంటి క్యారెక్టర్ ఆ సినిమాలో ఉండదు. దీన్ని బట్టి క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ముందుచూపు మనం అర్ధం చేసుకోవచ్చు.