Health

డార్క్ చాక్లెట్‌ ఇమ్యూనిటీ పెంచి కరోనాకు చెక్ పెడుతుందా….దీనిలో వాస్తవం ఎంత…?

చాక్లెట్‌ అంటే చిన్న పెద్దా అనే తేడా లేకుండా ప్రతిఒక్కరు ఇష్టంగా తింటారు. అయితే మాములు చాక్లెట్‌ కన్నా డార్క్ చాక్లెట్‌ తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే మాములు చాక్లెట్‌ కన్నా డార్క్ చాక్లెట్‌ కాస్త చేదుగా ఉంటుంది. అందువల్ల డార్క్ చాక్లెట్‌ తినటానికి కొంత మంది ఇష్టపడరు. అయితే ఇప్పుడు చెప్పే ప్రయోజనాలు తెలుసుకుంటే తప్పనిసరిగా డార్క్ చాక్లెట్‌ తినటం అలవాటు చేసుకుంటారు.

డార్క్ చాక్లెట్‌లో ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, రాగి, మాంగనీస్ వంటి ఖనిజాలు సమృద్ధిగాఉంటాయి .అందువల్ల వారంలో రెండు లేదా మూడు సార్లు డార్క్ చాక్లెట్ చిన్న మొత్తంలో తింటే మంచిదని నిపుణులు చెప్పుతున్నారు.

మనలో చాలా మంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నపుడు కాఫీ,టీ తాగుతూ ఉంటారు. అలాంటి సమయంలో కాఫీ,టీ లకు బదులుగా డార్క్ చాక్లెట్ తింటే.త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.అలాగే డార్క్ చాక్లెట్ రక్త సరఫరాను మెరుగుపర‌చ‌డంతో పాటు రక్తం గడ్డకట్టకుండా కూడా సహాయపడుతుంది.

ఇక డార్క్ చాక్లెట్ వ‌ల్ల మ‌రో అద్భుత‌మైన ప్ర‌యోజ‌నం ఏమిటంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మ‌న శ‌రీరంలో రోగనిరోధక శక్తిని బ‌ల‌ప‌రుస్తుంది.త‌ద్వారా క‌రోనా వంటి భ‌యంక‌ర వైర‌స్‌ల నుంచి ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు.