రైలు ప్రయాణం చేస్తే ఈ పాయింట్స్ పాటించాల్సిందే…లేకపోతే…?

ఇకపై ట్రైన్ బుక్ చేసుకొని ప్రయాణం చేసేవారికి భారతీయ రైల్వే కొన్ని ముఖ్యమైన నిబంధనలను సూచించింది. దీనికి సంబంధించి అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా 9 అంశాలతో కూడిన ఒక పోస్ట్ ను జత చేసింది. రైలు ప్రయాణం చేసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ 9 పాయింట్స్ గుర్తు పెట్టుకోవాలని తెలియజేసింది. లేకపోతే ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పింది.

ఈ టికెట్ కన్ఫామ్ అయిన ప్రయాణికులకు మాత్రమే రైల్వే స్టేషన్ లోకి రైలు ఎక్కడానికి అనుమతిని ఇస్తారు. దీని కోసం ప్రత్యేకంగా కన్ఫామ్ పాస్ చూపించాల్సిన అవసరం లేదు.కానీ ట్రైన్ లో ప్రయాణించే ప్రయాణికులు 90 నిమిషాలకు ముందే రైల్వే స్టేషన్ కు చేరుకోవాలి. ఎందుకంటే థర్మల్ స్క్రీనింగ్ చేయించుకోవాలి కాబట్టి. థర్మల్ స్క్రీనింగ్ పూర్తీ అయ్యాక ఎటువంటి కరోనా వైరస్ లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే ట్రైన్ ఎక్కటానికి అనుమతిని అధికారులు ఇస్తారు.

ప్రయాణం చేసే వారి స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి.ప్రయాణికులకు అవసరమైన అన్ని వస్తువులను వెంట తెచ్చుకోవాలి. రైలు ఎక్కేటప్పుడు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. మాస్క్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అలాగే శానిటైజర్ కూడా. మీరు వెళ్లాల్సిన రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కచ్చితంగా ఆ రాష్ట్రాలకు సంబంధించి హెల్త్ ప్రోటోకాల్స్ ను ప్రయాణికులు అంగీకరించాల్సిన అవసరం ఉంది.

error: Content is protected !!