సోనూ సూద్ రాజకీయాల్లోకి వస్తాడా…నిజం ఇదే…ఆలస్యం చేయకుండా చూసేయండి

ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా పాపులర్ అయితే అతడి మీద పొలిటికల్ పార్టీల కన్ను పడుతుంది. పార్టీలో చేరాలని కోరతారు. పోటీ చేయాలంటూ ఆహ్వానాలు పంపుతారు. ఇప్పుడు కరోనా లాక్ డౌన్ సమయంలో వలస కూలీలు సహా అన్నార్థులను ఆదుకొని ఫేమస్ గా నిల్చిన బహు బాషా నటుడు, బాలీవుడ్ నటుడు సోనూ సూద్ పై కూడా ఇలాంటి వార్తలే వస్తున్నాయి. అడిగిన వారికి.. అడగని వారికి.. తనకు కనిపించిన వారందరికీ సాయం చేస్తూ వస్తున్న సోనూ తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ పేద రైతు కష్టాన్ని చూసి ట్రాక్టర్ ను 24గంటల్లో పంపించాడు.అయితే సోనూ సూద్ ఇంత నిస్వార్థంగా సేవ చేస్తుండడంతో అందరూ ఆయననే సాయం కోసం ట్విట్టర్ లో అడుగుతున్నారు. ఇక ప్రభుత్వాలకు పన్నులు కట్టకుండా సోనూ సూద్ కే తాము పన్ను కడుతామంటూ కొందరు నెటిజన్లు సోనూను అభినందిస్తున్నారు.

దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ చూశాక ఆయనను చేర్చుకోవాలని ప్రధాన రాజకీయా పార్టీలన్నీ కాచుకు కూర్చున్నాయి. సోనూ ఓకే చెప్పడమే ఆలస్యం.. ఆయనను ఎన్నికల్లో నిలబెట్టి ఈజీగా గెలువచ్చు అని భావిస్తున్నాయి. కానీ సోనూ మాత్రం ఇప్పట్లో రాజకీయాల్లోకి రావాలనుకోవడం లేదని తెలుస్తోంది.

ఈనేపథ్యంలోనే ఇంత సేవ చేస్తున్నారు.. రాజకీయాల్లో చేరి , మరింత సేవ చేయొచ్చు కదా అని తాజాగా సోనూ సూద్ ను ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూ లో అడగ్గా ఆసక్తికరంగా స్పందించారు. సేవ చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని.. యాక్టర్ చేయవచ్చని, ఇప్పుడు అదేగా చేస్తున్నా అని చెప్పుకొచ్చాడు. తనకు నటన అంటే ఇష్టమని.. ఇంకో పదేళ్ల వరకు తెలుగు బాలీవుడ్ సహా అన్ని భాషల చిత్రాలు చేస్తూ ఉంటానని స్పష్టం చేసాడు. తనకు సినిమా అవకాశాలు బాగానే ఉన్నాయని, ఇంకో పదేళ్ల వరకు సినిమా అవకాశాలు లేకపోతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని సోనూ సూద్ చెప్పాడు.

error: Content is protected !!