Movies

‘పోలీస్ స్టోరీ’ సినిమాలో మొదట హీరోగా ఎవర్ని అనుకున్నారో తెలుసా ?

ఒకరి కోసం అనుకున్న సినిమా మరొకరితో తీయాల్సి వస్తుంది. ఇది ఇండస్ట్రీలో మామూలే. తీరా హిట్ అయ్యాక అయ్యో వదిలేసుకున్నామే అని బాధ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇక టాలీవుడ్ లో పిజె శర్మ తనయుడిగా ఎంట్రీ ఇచ్చి నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సత్తా చాటిన డైలాగ్ కింగ్ సాయి కుమార్ హీరోగా కూడా సక్సెస్ అయ్యాడు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన సాయి కుమార్.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా… ఆపై హీరోగా ఎన్నో పాత్రల ను అవలీలగా పోషించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. కొడుకు ఆదిని కూడా హీరోగా ఎంట్రీ ఇప్పించారు. ముఖ్యంగా రజినీకాంత్ భాషా సినిమా చూస్తే…అందులో రజినీ..భాషా ఒక్కసారి చెబితే…వంద సార్లు చెప్పినట్టు అనే డైలాగ్ థియేటర్స్‌లో పేలడం వెనక వున్న వ్యక్తి డైలాగ్ కింగ్ సాయి కుమార్. తన వాయిస్‌తో భాషా సినిమా ఎక్కడికో వెళ్లేలా చేసారు.

హీరోగా సుమన్ నటించిన ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు డబ్బింగ్ చెప్పిన సాయికుమార్ ఎందరో హీరోలకు డబ్బింగ్ చెప్పారు. అంకుశం సినిమాలో డాక్టర్ రాజశేఖర్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర అంతలా పండిందంటే అందుకు సాయికుమార్ చెప్పిన డబ్బింగ్ కారణం. ఇలా తెలుగు హీరోలకే కాదు…ఇక్కడ డబ్ అయిన చాలా చిత్రాలకు తన గొంతు అందించాడు. దాదాపు వెయ్యికి పైగా సినిమాలకు తన డబ్బింగ్‌తో ప్రాణం పోసిన సాయికుమార్ ‘పోలీస్ స్టోరీ’ మూవీతో హీరోగా ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేసాడో తెల్సిందే. పోలీస్‌ల మీద వచ్చిన సినిమాల్లో ప్రత్యేక స్థానం పోలీస్ స్టోరీ దక్కించుకుంది. రీసెంట్‌గా షష్టి పూర్తి చేసుకున్న సాయికుమార్ … ఆలీతో సరదాగా అనే కార్యక్రమలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారు. ఆసమయంలో హీరోగా తనకు బ్రేక్ ఇచ్చిన ‘పోలీస్ స్టోరీ’ విషయమై స్పందించారు. తను ‘లాకప్ డెత్’ చేస్తోన్న సమయంలో పోలీస్ స్టోరీ మూవీ డైరెక్టర్ థ్రిల్లర్ మంజు పరిచయమయ్యారు. కన్నడలో పోలీస్ సినిమాలంటే ముందుగా శంకర్ నాగ్, ఆ తర్వాత దేవరాజ్‌లకు మంచి పేరుంది.

ఇక హీరో దేవరాజ్‌తో తాను చాలా సినిమాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. పోలీస్ స్టోరీ సినిమా దేవరాజే ముందుగా చేయాల్సి ఉంది. ఇది వన్ సైడ్ కథ. హీరోయిన్, పాటలు, రొమాంటిక్ సీన్స్ ఉండవు. థ్రిల్లర్ మంజుతో పాటు దేవరాజ్ కూడా పోలీస్ స్టోరీ కథను తనతో పంచుకున్నా, ఆ తర్వాత ఆ స్టోరీ కోసం థ్రిల్లర్ మంజు పెద్ద హీరోలను అనుకున్నా, ఎవరూ కుదరకపోవడంతో అందుకే కుమార్ గోవింద్‌ను అనుకుంటున్నాం అంటూ థ్రిల్లర్ మంజు అప్పట్లో తనతో చెప్పాడు’అని సాయికుమార్ గుర్తుచేసుకున్నారు. “ఆ తర్వాత నేను మా అమ్మతో పుట్టపర్తి సత్యసాయిబాబా దగ్గరకు వెళ్లగా, ఆయన నాకు ఐపీఎస్ ఆఫీసర్స్ తొడుక్కునే ఒక సూట్ ఇచ్చారు.

ఆ తర్వాత బాబా గారి మహిమ ఏదో.. అప్పట్లో ‘సర్కిల్ ఇన్‌స్పెక్టర్’‌ సినిమా చేస్తున్నాను. ఆ సినిమాలో నా క్యారెక్టర్ చనిపోతుంది. సాధారణంగా ఎవరైనా చనిపోయిన షూటింగ్ చేస్తుంటే, ఆ తర్వాత షూటింగ్ తర్వాత కెమెరా చూసి నవ్వడం ఆనవాయితీ. నేను కూడా అలాగే నవ్వాను. దీంతో థ్రిల్లర్ మంజు చూసి నీకో బ్యాడ్ న్యూస్. నేను తీయబోయే ‘పోలీస్ స్టోరీ’లో నువ్వే హీరో’ అనేసి వెళ్లిపోయాడు. జోక్ చేసారనుకున్నాను. కానీ మరుసటి రోజు పిలిస్తే వెళ్లి పూర్తి కథను తనకు నేరేట్ చేసారు. అలా ఆ సినిమా నా చేతికి వచ్చిందని వివరించారు.