గద్దలకొండ గణేష్’ సినిమాలోని ఈ హీరో తండ్రి కూడా టాలీవుడ్ హీరో..ఎవరో చూస్తే నోరెళ్ళబెడతారు!

సినిమా రంగం చాలా విచిత్రమైనది. ఎన్నో కష్టాలు పడితేనే గానీ నిలబడడం కష్టం. కానీ కొందరికి సినిమా రంగం వడ్డించిన విస్తరి. ఎందుకంటే తాతలు తండ్రులు సినీ రంగంలో ఏలేయడం అసలు కారణం. అయితే ఎంట్రీ ఇచ్చాక నిలబడడం అనేది వాళ్ళ టాలెంట్ ని బట్టి ఉంటుంది. ఇప్పుడు అలాంటి స్టార్ గురించి ప్రస్తావించాలంటే, తమిళంలో ఎన్నో మూవీస్ నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.

అంతేకాదు, తెలుగులో కూడా హీరోగా చేసాడు. హృదయం సినిమాలో హీరోగా చేసిన మురళి. అతడి కొడుకు అధర్వ. ఇక మురళి ఎవరంటే,తమిళ స్టార్ డైరెక్టర్ సిద్ధ లింగయ్య కొడుకే. అలా ఆ ఫ్యామిలీలో మూడోతరం నటుడిగా అధర్వ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు.

తమిళంలో బాణాకటాడి సినిమాతో ఎంట్రీ చ్చిన అధర్వ మొదటి సినిమాతోనే ప్రశంసలు అందుకున్నాడు. 2013లో పరదేశి మూవీతో ఫిలిం ఫేర్ అవార్డు కొట్టాడు. స్కూల్ స్టడీ అవ్వగానే యాక్టింగ్ స్కూల్లో చేరి ట్రైనింగ్ తీసుకున్నాడు. తొలిమూవీ కోసం అతడి పాత్రను పోషించడానికి 45రోజులు స్లమ్ ఏరియాలో ఉంటూ వారి లైఫ్ స్టైల్ తెలుసుకున్నాడు. హీరో వరుణ్ తేజ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ‘గద్దలకొండ గణేష్’ సినిమా లో హీరో బయోపిక్ తీసే డైరెక్టర్ వేషంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు.