యాపిల్ తో ఇలా చేస్తే అసలు మేకప్ జోలికి వెళ్లరు

యాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుఉన్నాయి . అయితే బ్యూటీ ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. మనలో చాలా మంది యాపిల్ తింటారు. కానీ బ్యూటీ ప్రయోజనాల కోసం పెద్దగా ఎవరు ఉపయోగించరు. ఇప్పుడు ఆ బ్యూటీ ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకుందాం.

యాపిల్ ముక్కలుగా కట్ చేసి మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో తేనే కలిపి ముఖానికి పట్టించి అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల మొటిమ‌ల‌, మ‌చ్చ‌లు తగ్గుతాయి. .అలాగే ముఖం కొత్త కాంతివంతంగా మారుతుంది.

యాపిల్‌ను వేడినీళ్ళలో వేసి మెత్తగా ఉడికించుకోవాలి.ఆ తర్వాత తొక్కను తొలగించి.పేస్ట్ చేసుకోవాలి.ఈ పేస్ట్‌లో గోధుమ‌పిండిని కలిపి ,ముఖానికి పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో మూడు సార్లు చేస్తే చర్మంలో ఉన్న మృతకణాలు అన్ని తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.