వారంలో మూడు సార్లు మజ్జిగచారు… ఎన్ని లాభాలో ?

ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మంచి ఆహారం,మంచి నిద్ర అవసరం. శరీరంలో రోగనిరోధక శక్తి కూడా చాలా అవసరం. అప్పుడే ఏ వైరస్ బారిన పడకుండా ఉంటాం. మజ్జిగచారుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. వారంలో మూడు సార్లు మజ్జిగచారు తింటే మంచిది.

వంటగదిలో అందుబాటులో ఉండే వస్తువులతో తయారుచేసే మజ్జిగచారులో ఉండే బ్యాక్టీరియా మన శరీరానికి చాలా మేలును చేస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.

పెరుగు లేదా మజ్జిగలో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి మంచిదనే విషయం మనకు తెలిసిందే. పులిసిన మజ్జిగలో మంచి బ్యాక్టీరియా రెట్టింపు శాతంలో ఉంటుంది.ఈ బ్యాక్టీరియా పేగుల్లోని చెడు బ్యాక్జీరియాను చంపేసి శరీరంలోకి ఎలాంటి వైరస్‌లు రాకుండా రక్షణ కల్పిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వైరస్ బారిన పడకుండా కాపాడుతుంది.