ఈ యంగ్ హీరోలు డబ్బు కోసం ఏమి చేస్తున్నారో తెలుసా ?
సినీ హీరోలు సినిమాల్లో యాక్ట్ చేయడంతో పాటు యాడ్స్ లో కూడా కనిపిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అయితే ఇది చాలదన్నట్లు సోషల్ మీడియాలో కూడా వాళ్ళ హవాయే ఎక్కువ కనిపిస్తోంది. అయితే ఇలాంటి కరోనా సమయంలో ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా ఉండాలి గానీ, డబ్బుకి కక్కర్తిపడి అడ్డమైన పోస్టులు పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, కరోనా సమయంలో కేసులు పెరిగిపోతున్నాయి. ఇలాంటి సమయంలో మద్యపానం,ధూమపానం లకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ప్రజల్లో చైతన్యం నింపాల్సి ఉంది. మాస్క్ ధరించడం,భౌతిక దూరం, తరచూ చేతులు శుభ్రం చేసుకోవడం గురించి మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు విస్తృత ప్రచారం చేసారు.
అయితే నవదీప్, సుధీర్ బాబు అయితే మెక్ డొనాల్డ్స్ ముందుకి సంబంధించి యాడ్ ని పోస్ట్ చేసారు. అంతేకాదు,తక్కువ ధర గల మందుని సెలబ్రిటీలు మాత్రం తాగరు. కానీ అదే తాగుతున్నట్లు బిల్డప్ ఇస్తూ, యాడ్స్ పోస్ట్ చేయడం దారుణమని నెటిజన్స్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు.