బిగ్ బాస్ లో ఛాన్స్ వదిలేసినా హైపర్ ఆది…ఎన్ని కోట్ల అఫర్…?

ఈటీవీలో వస్తున్న జబర్దస్త్ కామెడీ షో మొదటి నుంచి టిఆర్పి రేటింగ్ లో అదిరిపోతోంది. జనం ఈ షోకి అంతలా కనెక్ట్ అయ్యారు. ఎన్ని షోస్ వచ్చినా జబర్దస్త్ ముందు నిలబడడం లేదన్నది వాదన. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్స్ పరిచయమై ఆర్ధికంగా నిలబడడమే కాకుండా,పలు షోలు చేస్తూ సినిమాల్లో కూడా ఛాన్సులు అందిపుచ్చుకుంటున్నారు.

ఇక రియాల్టీ షోస్ లో బిగ్ బాస్ కి గల క్రేజ్ వేరు. బాలీవుడ్ మొదలు కోలీవుడ్ ,టాలీవుడ్ ఇలా అన్ని చోట్లా బిగ్ బాస్ దుమ్మురేపుతోంది. ఇప్పటీకే తెలుగులో మూడు సీజన్స్ పూర్తిచేసుకున్న బిగ్ బాస్ నాల్గవ సీజన్ కి రెడీ అవుతోంది. హోస్ట్ నాగార్జునతో ప్రోమో లాంచింగ్ కూడా అయింది. ఇక కంటెస్టెంట్స్ వేటలో పడ్డారు. అయితే జబర్దస్త్ షో ద్వారా అదిరిపోయే పంచ్ లతో తనదైన కామెడీ ట్రాక్ తో ఆకట్టుకునే హైపర్ ఆదికి మంచి పేరుంది.

బిగ్ బాస్ లో పాల్గొంటే ఆదికి మంచి డబ్బులొస్తాయి. ఎంతలేదన్నా రోజుకి లక్ష రూపాయల రెమ్యునరేషన్ ఉంటుందని టాక్. అయితే ఆదికి ఎపిసోడ్ కి 7లక్షల దాకా ఇవ్వడానికి అఫర్ ఇచ్చారట. తాను నమ్ముకున్న జబర్దస్త్ ని వదలడానికి ఆది ఇష్టపడలేదట. సున్నితంగా తిరస్కరించాడట. ఈవార్త తెగ వైరల్ అవుతోంది. అయితే దీనిపై పూర్తీ క్లారిటీ రావాల్సి ఉంది.

error: Content is protected !!