Movies

సోనూ సూద్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

కరోనా కష్టకాలంలో దేశమంతా మారుమోగిన పేరు సోనూసూద్. ఎందరో వలస కార్మికులకు అన్నం పెట్టి,సొంత డబ్బులతో ఇళ్లకు చేరవేసాడు. విదేశాల్లో చిక్కుకున్నవాళ్ళకోసం ప్రత్యేక విమానాలు నడిపించి తీసుకొచ్చాడు. సినిమాల్లో విలన్ అయినా నిజ జీవితంలో హీరో అని దేశంలో ఎందరో కీర్తిస్తున్నారు. బాలీవుడ్ లో సైడ్ హీరోగా, హీరోగా,విలన్ గా రాణిస్తూ,టాలీవుడ్ లో అరుంధతి మూవీతో విలన్ గా బాగా పాపులర్ అయ్యాడు. 1973జులై 30న పంజాబ్ లో జన్మించాడు.

బాలీవుడ్ లో 2018లో సిందా అనే మూవీ ద్వారా ఎంట్రీ ఇచ్చి భారీ హిట్ కొట్టాడు. పఠాన్,టుక్ టుక్, హ్యాపీ న్యూ ఇయర్ మూవీస్ భారీ హిట్ ఇచ్చాయి. ఇక 2010లో దగాన్ లో నెగిటివ్ క్యారెక్టర్ తో మంచి హిట్ అందుకున్నాడు. సింగిల్ థింక్,జోదా అక్బర్ మూవీస్ మంచి హిట్ ఇచ్చాయి. తర్వాత వరుస ప్లాప్ లు చూసాడు.

తెలుగులో అరుంధతితో మంచి హిట్ నమోదుచేసుకుని నిన్ను వదల బొమ్మాళి అంటూ అందరి హృదయాల్లో నిలిచాడు. దూకుడు,వంటి హిట్ మూవీస్ లో చేసి తెలుగు ఆడియన్స్ కి బాగా దగ్గరయ్యాడు. పలు భాషల్లో నటిస్తూ తన చరిష్మా చూపిస్తున్నాడు. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు. రీల్ హీరో కూడా అవుతాడేమో చూడాలి.