Health

కరోనా సమయంలో ఆవిరి పడుతున్నారా…మిస్ కాకుండా చూడండి

మనకు రొంప వచ్చినప్పుడు ముక్కు దిబ్బడతో చాలా ఇబ్బంది పడతాం. ఆ సమయంలో ఆవిరి పట్టుకుంటూ ఉంటాం. ఆవిరి పట్టినప్పుడు ఆ నీటిలో కాస్త విక్స్ ,పసుపు వేస్తాం. అప్పుడు జలుబు ఇట్టే తగ్గిపోతుంది. జలుబు తగ్గటమే కాకుండా ఒత్తిడి, అలసట కూడా తగ్గిపోతాయి. ఆవిరి పట్టటం వలన ముఖం కూడా కాంతివంతంగా మారుతుంది.

వేడి నీటిలో టీ బ్యాగులను వేసి ఆవిరి పడితే ముఖం తాజాగా మెరిసిపోతుంది.అలాగే కొన్ని కొబ్బరి నూనె చుక్కలు వేసుకుంటే, ముఖానికి తేమ తగలడమే కాకుండా, సూక్ష్మ రంధ్రాలు తెరచుకుంటాయి.

పని ఒత్తిడి తగ్గుతుంది, అలాగే కండరాలు ఉత్తేజితం అవుతాయి. తీసుకున్న ఆహారం బాగా జీర్ణం కావటంతో కీళ్ల నొప్పుల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది.

ఉబ్బసం, ఆయాసం, జలుబు వంటి వ్యాధులతో బాధపడేవారికి ఆవిరి పడితే తొందరగా ఉపశమనం కలుగుతుంది.