Movies

యాంకర్ ప్రదీప్ పెళ్లి చేసుకోకపోవటానికి కారణం ఆమేనా…మనస్సు మారదా ?

తెలుగు టెలివిజన్ రంగంలో ఫీమేల్ యాంకర్స్ సుమ,ఝాన్సీ,ఉదయ భాను ఇలా చాలామంది దూసుకుపోతున్నారు. ఇక మేల్ యాంకర్స్ లో తనకంటూ ఓ ప్రత్యేక శైలితో ఆడియన్స్ కి దగ్గరైన యాంకర్ ప్రదీప్ ఎన్నో టివి షోస్ తో అలరిస్తూనే సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. సాంగ్స్ బాగున్నా, కరోనా కారణంగా సినిమా రిలీజ్ వాయిదా పడింది. సినిమా రిలీజయితే గానీ రిజల్ట్ తెలీదు.

ఇంతలా రాణిస్తున్న ప్రదీప్ ఇంతదాకా పెళ్ళిజోలికి వెళ్ళలేదు. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉంటున్న సమయంలో నిద్ర పోవడానికి కూడా సమయం ఉండేది కాదని,అందుకే ప్రేమ పెళ్లి అంటూ తిరగే ఛాన్స్ రాలేదని ప్రదీప్ చెప్పే మాట. ఇక ఇంట్లో వాళ్ళు కూడా సంబంధాలు చూసి,చూసి ఇక విసుగెత్తిపోయి,నిర్ణయం ప్రదీప్ కి వదిలేసారట.

అయితే యాంకర్ గా లేనప్పుడు ఓ అమ్మాయి ప్రేమలో పడినప్పటికీ పోషించే స్థోమత లేకపోవడం వలన దూరం అయ్యాడని,ఇప్పుడామె పెళ్ళయిపోయి భర్తతో,పిల్లలతో హాయిగా ఉంటోందట. ఆమె ఇంకా మనసులో ఉండబట్టే ఎన్ని సంబంధాలు వచ్చినా నో చెబుతూ వస్తున్నాడని టాక్. ఇప్పుడు బిజీగా ఉండడమే కాకుండా 35ఏళ్ళు కూడా వచ్చేసాయి. ఇప్పుడు పెళ్ళికి రెడీ అంటున్నాడు. అయితే ఏ సంబంధం చూస్తారో, ఏది ఒకే అవుతుందో చూడాలి.