ఈ చైల్డ్ ఆర్టిస్ట్ తండ్రి టాలీవుడ్ టాప్ విలన్ అని మీకు తెలుసా?
సినిమా రంగంలో గతంలో చైల్డ్ ఆర్టిస్టులుగా బయట వాళ్లకి ఛాన్స్ దక్కేది. వారసత్వంలో కొడుకులు,మనవళ్లు,మనవరాళ్లు ఇలా ఇంట్లో వాళ్లే చైల్డ్ ఆర్టిస్టులు గా వస్తున్నారు. ఇక పలు సినిమాల్లో బాలనటిగా నటించిన సారా అర్జున్ కూడా అలాంటి బాపతే అని అంటున్నారు. ఈ చిన్నారి 2011లో వచ్చిన 404 సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తెలుగు,తమిళ ,హిందీ, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో తన నటనతో అదరగొట్టేసింది. తొలిమూవీతోనే పాపులర్ అయిన ఈ చిన్నారి తమిళ్ లో దైవ తిరుమగళ్ సినిమాలో చేయగా, అదే తెలుగులో నాన్న పేరుతో అనువాదం అయింది. నాన్న మూవీలో వెన్నెల పాత్ర సారా అర్జున్ నటన సూపర్భ్. ముఖ్యంగా క్లైమాక్స్ లో విక్రమ్, వెన్నెల మధ్య వచ్చే ఎమోషనల్ సీన్ చూసి కంటతడి పెట్టిస్తుంది.
తర్వాత ఒక తమిళ్ సినిమా, స్టాలిన్ రీమేక్ గా హిందీలో తీసిన జై హో లో నటించింది. 2014 లో శైవం అనే తమిళ సినిమాలో నటించింది. ఇక నటకిరీటి రాజేంద్రప్రసాద్ మానవరాలిగా 2015 లో సినిమా తెలుగులో దాగుడుమూత దండాకోర్ పేరుతో రీమేక్ అయ్యింది. రీమేక్ లో కూడా తన పాత్రను ఈ పాపే వేసి,తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరైంది. పోషించింది. 2019లో ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా సినిమాలో చిన్నప్పటి సోనమ్ కపూర్ పాత్ర లో నటించింది.
అంతేకాదు సాండ్ కీ ఆంఖ్ మూవీలో వృద్ధురాలి పాత్రలు పోషించిన తాప్సీ, భూమి పెడ్నేకర్ ల మనవరాలిగా చేసింది. సిల్లు కరుపట్టి అనే తమిళ్ మూవీలో ఈ సినిమాలో నాలుగు ప్రేమకథలు ఉంటాయి. అందులో ఒక ప్రేమకథ, టీనేజ్ లవ్ స్టోరీ. ఆ కథలో సారా అర్జున్ ఏకంగా హీరోయిన్ గా వేసి మెప్పించింది. ఇంతకీ సారా తండ్రి రాజ్ అర్జున్ కూడా నటుడే. ఎన్నో హిందీ తమిళ చిత్రాల్లో నటించారు. తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో రాజ్ అర్జున్ విలన్ పాత్ర వేసాడు. మొత్తానికి చైల్డ్ ఆర్టిస్టులు కూడా ఇలా వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు.