Movies

ప్రభాస్ కెరీర్ లో ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా ?

రెబెల్ స్టార్ కృష్ణం రాజు సోదరుడి కుమారుడు ప్రభాస్ టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి బాహుబలితో వరల్డ్ లెవెల్ కి ఎదిగిపోయాడు. ఫాన్స్ అతడిని డార్లింగ్ అని ముద్దుగా పిలుస్తారు. యంగ్ రెబెల్ స్టార్ గా ప్రభాస్ ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. యాక్టింగ్,డాన్స్,ఫైట్స్ లో తనదైన టాలెంట్ చూపిస్తూ ఎదిగిన ప్రభాస్ బాహుబలి తర్వాత సాహో తో కూడా సౌత్ ఇండియా సత్తా చాటాడు. ప్రస్తుతం కె రాధాకృష్ణ డైరెక్షన్ లో చేసున్న రాధేశ్యాం మూవీ చేస్తున్న ప్రభాస్ త్వరలో వైజయంతి బ్యానర్ లో పాన్ ఇండియా మూవీలో నటించబోతున్నాడు.

2002లో ఈశ్వర్ ఏవరేజ్ గా నిల్చింది. 2003లో రాఘవేంద్ర మూవీ ప్లాప్. ఇక మూడవ సినిమాగా శోభన్ డైరెక్షన్ లో2004లో వచ్చిన వర్షం మూవీతో స్టార్ హీరో అయిపోయాడు. తర్వాత అడవిరాముడు యావరేజ్. 2005లో కృష్ణవంశీ తెరకెక్కించిన చక్రం ప్లాప్ గా నిలిచినప్పటికీ యాక్టింగ్ పరంగా ప్రభాస్ కి మంచి మార్కులే పడ్డాయి. 2005లో రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన బాహుబలి ప్రభాస్ అంటే ఏమిటో చూపించింది. మొత్తం రెండు భాగాలూ బ్లాక్ బస్టర్ కావడమే కాదు, వాటి రికార్డులని ఇంకా ఏదీ క్రాస్ చేయలేదు. చేసే ఛాన్స్ కన్పించడం లేదు.

తర్వాత ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన మూవీ ప్లాప్. ఇక యోగి సినిమా యావరేజ్. 2007లో మున్నా ప్లాప్. తర్వాత పూరి డైరెక్షన్ లో బుజ్జిగాడు ప్లాప్. 2009లో బిల్లా యావరేజ్. తర్వాత ఏక్ నిరంజన్ బిలో యావరేజ్. 2010లో డార్లింగ్ మూవీతో భారీ హిట్ కొట్టిన ప్రభాస్ వరుస విజయాలను నమోదుచేసుకున్నాడు. 2011లో మిస్టర్ పెర్ఫెక్ట్ హిట్ కొట్టాడు. తర్వాత రెబెల్ ప్లాప్. 2013లో మిర్చి సూపర్ డూపర్ హిట్. ఇక 2015లో బాహుబలి బిగినింగ్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. 2017లో బాహుబలి కంక్లూజన్ ఆల్ టైం రికార్డ్. 19సినిమాలు చేస్తే,బ్లాక్ బస్టర్ లు 5, సెమి హిట్స్ 2, ఏవరేజ్ 5,ప్లాప్ లు 6ఉన్నాయి. ఇక సాహో ప్లాప్ అయినప్పటికీ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టపడే ప్రభాస్ కి తక్కువ మందే ఫ్రెండ్స్ ఉన్నా అందరితో క్లోజ్ గా మూవ్ అవుతాడు.