గ్రీన్ టీ తో ఎన్ని చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చో చూడండి

గ్రీన్ టీ అంటే ఒకప్పుడు ఎవరు పెద్దగా వాడేవారు కాదు. కానీ ఇప్పుడు ఎవరి నోటా విన్న గ్రీన్ టీ గురుంచే. అంతలా గ్రీన్ టీ వాడకం పెరిగిపోయింది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు, అమినో యాసిడ్స్, మ్యాంగనీస్, విటమిన్ బి వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గ్రీన్ టీ లో ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా బ్యూటీ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ రోజు గ్రీన్ టీ లో ఉన్న బ్యూటీ ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

గ్రీన్ టీలో నిమ్మరసం కలిపి కాటన్ బాల్ సాయంతో మొటిమలు,నల్లని మచ్చలు ఉన్న ప్రదేశంలో రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే క్రమంగా మొటిమలు తగ్గిపోతాయి. గ్రీన్ టీలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మొటిమలను, మ‌చ్చ‌ల‌ను తగ్గించటంలో సహాయపడుతుంది.

ప్ర‌తిరోజు గ్రీన్ టీతో ముఖం క‌డుక్కుంటే చ‌ర్మంలోని మ‌లినాల‌ను తొల‌గించి చ‌ర్మ‌రంధ్రాల‌ను శుభ్ర‌ ప‌రుస్తుంది. ముఖాన్ని ఫ్రెష్‌గా, కాంతివంతంగా మెరుస్తుంది.

గ్రీన్ టీ పౌడ‌ర్‌లో కొద్దిగా తేనె, నిమ్మ‌ర‌సం క‌లిపి ముఖానికి రాసి అరగంట అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ఉన్న జిడ్డు అంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది.

How To Use Green Tea For Glowing Skin? Green Tea For Glowing Skin, Green Tea, Glowing Skin, Beauty Tips, Beauty, Skin Care, Latest News – Telugu Beauty, Beauty Tips, Glowing Skin, Green Tea, Green Tea For Glowing Skin, Latest News, Skin Care