బేకింగ్ సోడాతో ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే ముఖం మిలమిల మెరిసిపోతుంది

ప్రతి అమ్మాయి అందంగా ఉండాలని కోరుకుంటుంది. అది సహజం కూడా. అలాగే దాని కోసం చేయని ప్రయత్నం కూడా ఉండదు. అందం కోసం ఎంత ఖర్చు పెట్టటానికి అయినా సిద్ధంగా ఉంటారు. అయితే ఇంటి చిట్కాలను పాటిస్తే పెద్దగా ఖర్చు పెట్టకుండానే అందమైన కాంతివంతమైన ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు. మనం రెగ్యులర్ గా ఉపయోగించే బేకింగ్ సోడాతో ఈ చిట్కాలను తెలుసుకుందాం.

బేకింగ్ సోడా.చ‌ర్మంపై ఉన్న మృతకణాల‌ను తొలగించటానికి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. బేకింగ్ సోడాలో నీటిని కలిపి పేస్ట్ గా చేసి ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే చర్మంపై మృతకణాలు తొలగిపోయి చర్మం కాంతివంతంగా మారుతుంది.

కొద్దిగా బేకింగ్ సోడా తీసుకుని.అందులో కొద్దిగా నిమ్మ‌ర‌సం వేసి బాగా కలపాలి. ఈ పేస్ట్ ని ముఖానికి రాసి 2 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి అరగంట అయ్యాక ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మొటిమలు,నల్లని మచ్చలు తొలగిపోతాయి.

error: Content is protected !!