Healthhealth tips in telugu

ఈ చిన్న చిట్కాతో మోకాళ్ళ నొప్పులు,వెన్ను నొప్పులకు 7 రోజుల్లో చెక్ పెట్టవచ్చు

Joint pains Home Remedies : ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిలోనూ కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు,వెన్ను నొప్పి వంటివి వచ్చేస్తున్నాయి. ఈ నొప్పులు వచ్చాయంటే నడవడం కష్టం. కూర్చుని లేచి నాలుగు అడుగులు వేయటానికి కూడాి కష్టంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలు ఫాలో అయితే నొప్పి నుండి కాస్త ఉపశమనం కలుగుతుంది.
garlic
నొప్పి కాస్త తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ఇంటి చిట్కాలు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. అదే నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. ఇక ఇప్పుడు చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం. 2 స్పూన్ల ఆవాల నూనె లో రెండు వెల్లుల్లి రెబ్బలను కచ్చాపచ్చాగా చేసి వేసి బాగా వేగించాలి. ఈ నూనెతో నొప్పులు ఉన్న ప్రదేశంలో మసాజ్ చేసుకుంటే మంచి ఉపశమనం కలుగుతుంది.

ఇలా చేయటం వలన ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ మెరుగు పడటమే కాకుండా వాపు కూడా తగ్గుతుంది. పది నిమిషాలు మసాజ్ చేస్తే సరిపోతుంది. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన కీళ్ల నొప్పులు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాబట్టి మోకాళ్ళ నొప్పులు, కీళ్ల నొప్పులు,వెన్ను నొప్పి ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది.

పాలలో ఉండే పోషకాలు కూడా ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. కాబట్టి ప్రతిరోజు పసుపు పాలు తాగడం అలవాటు చేసుకోండి.
ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు నీటిలో అర చెక్క నిమ్మరసం కలిపి తాగాలి. నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి. నిమ్మలో ఉండే లక్షణాలు నొప్పులను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.