మధ్యాహ్నం భోజనం తర్వాత పడుకుంటున్నారా… తప్పనిసరిగా చూడండి

కరోనా వచ్చే దగ్గర్నుండి లాక్ డౌన్ కారణంగా ఎంతోమంది ఇంటినుంచే ఉద్యోగాలు చేస్తున్నారు. దాంతో మధ్యాహ్నం భోజనం అయ్యాక కాస్త కునుకు తీస్తున్నారు. కొంతమంది మధ్యాహ్నం భోజనం అయ్యాక ఒక కునుకు తీస్తే చాలా మంచిది అని భావిస్తారు. భోజనం కాగానే నిద్ర రావడం సహజమే.అయితే నిపుణులు ఇలా మధ్యాహ్నం భోజనం అయ్యాక పడుకుంటే కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. భోజనం అయ్యాక పడుకున్నప్పుడు కడుపులోనుంచి జీర్ణ రసాలు గురుత్వాకర్షణ శక్తి కారణంగా ఆహారం వైపు వస్తాయి.

దాంతో ఆమ్ల స్వభావం కారణంగా గొంతు మంట ఏర్పడుతుంది. కాబట్టి భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. అంతేకాకుండా భోజనం చేసిన వెంటనే పడుకోవడం వల్ల తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణాశయం మీద ఒత్తిడి తెస్తుంది. దాంతో గురక కూడా వస్తుంది. కాబట్టి భోజనం అయ్యాక ఒక గంట తర్వాత పడుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు. భోజనం చేసిన వెంటనే పడుకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది. కాబట్టి భోజనం అయ్యాక కనీసం అరగంట గ్యాప్ ఇచ్చి పడుకోండి.