వి సినిమాని ఎంతమంది హీరోలు రిజెక్ట్ చేశారో తెలుసా?

నాని ఎన్నో ఆశలు పెట్టుకున్న 25 సినిమా వి సినిమా అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అయింది. ఎన్నో అంచనాలతో రిలీజైన ఈ సినిమా కాస్త నిరాశ పరిచింది. నాని తనకు 25 సినిమా అవ్వటంతో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకున్నాడు. నెగిటివ్ షేడ్ ఉండటంవల్ల అభిమానుల్లో కూడా ఆసక్తి కలిగింది. కానీ సినిమా విడుదలయ్యాక నిరాశ కలిగింది అభిమానులకు.అయితే ఈ సినిమా మొదట ఇద్దరు హీరోలు వద్దకు వెళ్లిందట. వాళ్ళు రిజెక్ట్ చేశాక నాని వద్దకు వచ్చిందట. దర్శకుడు చెప్పిన కథ దిల్ రాజుకు బాగా నచ్చిందట.

దాంతో మొదట అల్లుఅర్జున్ వద్దకు పంపాడట. అల్లు అర్జున్ నో చెప్పడంతో సాయిధరమ్ తేజ బతుకు వెళ్లిందట. సాయి ధరమ్ తేజ్ తాను ఉన్న పరిస్థితుల్లో ప్రయోగాలు చేయనని చెప్పాడట దాంతో దర్శకుడు ఇంద్రగంటి మోహన్కృష్ణ నాని వద్దకు వెళ్లారట. నాని వెంటనే ఓకే చెప్పేశాడట.నాని మొదటి సినిమా దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ. దాంతో కథ వినకుండా ఓకే చెప్పాడా అనే అనుమానం నాని అభిమానుల్లో కలుగుతుంది.