Beauty Tips

ఆలివ్ ఆయిల్ తో ఈ హెయిర్ పాక్స్ ఎప్పుడైనా ట్రై చేసారా ?

ప్రపంచవ్యాప్తంగా కొన్ని శతాబ్దాలుగా ఆలివ్ నూనెను బ్యూటీ ఉత్పత్తులలో వాడుతున్నారు. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉంటాయి. అంతేకాక ఆలివ్ నూనెలో ఉండే విటమిన్ ఎ మరియు E జుట్టు వేగంగా పెరగటానికి సహాయపడతాయి. అదనపు వర్జిన్ కొబ్బరి నూనె వలే ఆలివ్ ఆయిల్ కూడా జుట్టుకు మంచి కండీషనర్ మరియు మాయిశ్చరైజర్ గా పనిచేయుట వలన తల మీద చర్మంలోకి కూడా వ్యాప్తి చెందే సామర్ధ్యం కలిగి ఉంటుంది. ఆలివ్ నూనె మీ జుట్టుకు పోషణ ఇవ్వటం,జుట్టు తెగిపోవటంను అడ్డగించుట, పొడిదనం తగ్గించుట,జుట్టును తేమగా ఉంచి జుట్టు దెబ్బతినకుండా కాపాడుతుంది. అలాగే జుట్టు రాలకుండా బలంగా పెరగటానికి కూడా సహాయం చేస్తుంది.

ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ చికిత్సలు

1. తేనె మరియు ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ (పొడి గిరజాల జుట్టు)

ఈ ప్యాక్ లో తేనేను ఉపయోగించటం వలన జుట్టు తేమగా ఉంటుంది. ఈ ప్యాక్ జుట్టుకి వేసిన తర్వాత మరింత నీటిని గ్రహించి జుట్టు చూడటానికి ప్రకాశవంతంగా మరియు మృదువుగా కనపడుతుంది. ఆలివ్ నూనె జుట్టు తెగిపోకుండా
మరియు పొడిగా మారకుండా సహాయపడుతుంది. మనం నేచురల్ కొబ్బరి పాలను ఉపయోగించవచ్చు. ఒకవేళ తాజా కొబ్బరి పాలు దొరక్కపోతే మార్కెట్ లో అమ్మే డబ్బా కొబ్బరి పాలను కూడా ఉపయోగించవచ్చు. కొబ్బరి పాలల్లో ఉండే పోషకాలు జుట్టు తెగిపోకుండా అపుతాయి. అలాగే జుట్టు తేమగా ఉండేలా చూసే సామర్ధ్యం కలిగి ఉంటుంది.

కావలసినవి

ఆలివ్ నూనె – 2 లేదా 3 స్పూన్స్
తేనె – 1 లేదా 2 స్పూన్స్
కొబ్బరి పాలు – ఒక కప్పు

పద్దతి

1. ఒక బౌల్ లో కొబ్బరి పాలు, తేనె మరియు ఆలివ్ నూనె వేయాలి.
2. ఈ మూడింటిని బాగా కలపాలి.
3. ఈ ప్యాక్ ని జుట్టుకు రంగు బ్రష్ సాయంతో పట్టించాలి.
4. ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ ని తల మీద చర్మం నుంచి జుట్టు చివర్ల వరకు బాగా పట్టించాలి.
5. రెండు నిముషాలు మసాజ్ చేసి,ఒక అరగంట అలా వదిలేయాలి.
6. ఆ తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే మంచి పలితం కనపడుతుంది.

2. అవెకాడో మరియు ఆలివ్ ఆయిల్ హెయిర్ మాస్క్ (తెగిపోవటం)

ఈ మాస్క్ లో అవోకాడో, ఆలివ్ నూనె మరియు తేనె వంటి మూడు పదార్దాలు ఉన్నాయి. అవోకాడోలో ప్రొటీన్లు, విటమిన్ బి, ఇ సమృద్ధిగా ఉండుట వలన నిస్తేజంగా మరియు పొడిగా ఉన్న జుట్టును పునరుద్ధరించడానికి, పెరుగుదల ఉద్దీపన మరియు జుట్టుకు బలాన్ని ఇవ్వటానికి సహాయపడుతుంది. ఆలివ్ నూనెలో విటమిన్ ఎ మరియు E,యాంటి ఆక్సిడెంట్స్ సమృద్దిగా ఉండుట వలన జుట్టుకు పోషణను ఇవ్వటమే కాకుండా ఆరోగ్యకరమైన మెరిసే మరియు మృదువైన జుట్టుకు సహాయపడుతుంది. తేనే జుట్టు మృదుత్వానికి మరియు తల మీద చర్మం తేమగా ఉండేలా చేయటంలో సహాయపడుతుంది.

కావలసినవి
పండిన అవెకాడో పండు – 1
ఆలివ్ నూనె – 2 లేదా 3 స్పూన్స్
తేనె – 1 స్పూన్
పెరుగు

పద్దతి

1. అవెకాడో పండును చిన్న చిన్న ముక్కలుగా కోయాలి.
2. బ్లెండర్ లో అవోకడో ముక్కలు,ఆలివ్ నూనె, పెరుగు, తేనె వేసి మెత్తని పేస్ట్ గా చేయాలి.
3. ఈ మాస్క్ ని జుట్టు మూలాల నుండి చివర్ల వరకు రాయాలి.
4. 40 నిముషాలు అయ్యాక ఎక్కువ నీటిని ఉపయోగించి జుట్టును శుభ్రం చేయాలి.
5. ఆ తర్వాత తేలికపాటి షాంపూ ని ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి.