Beauty Tips

మందారపువ్వులో ఎన్ని బ్యూటీ ప్రయోజనాలు దాగి ఉన్నాయో ?

ఫేస్ ప్యాక్
* ఎరుపు మందార పువ్వుల రేకలను ఎండబెట్టి పొడి చేయాలి.
* ఈ పొడిలో నీరు లేదా పాలు పోసి పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ ని ప్రతి రోజు ముఖానికి రాయాలి.
* ఈ ప్యాక్ ముఖం మీద దుమ్మును తొలగించి ముఖం ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తుంది. అలాగే ముడతలను తొలగించటానికి కూడా సమర్ధవంతంగా పనిచేస్తుంది.

పొడి చర్మం
* ఎరుపు మందార రేకలను కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనెలో వేసి మరిగించాలి.
* ఈ నూనె చల్లారిన తర్వాత ముఖానికి రాయాలి.
* ఈ నూనె పొడి చర్మం లేదా పగుళ్లను నయం చేయటంలో బాగా సహాయపడుతుంది.

కనుబొమ్మలు
* ఎరుపు మందార రేకలను బాగా ఎండబెట్టి వేగించి పొడి చేయాలి.
* ఈ పొడిని కనుబొమ్మల మీద రాయాలి. ఈ విధంగా చేయుట వలన కనుబొమ్మలకు మంచి రంగు మరియు పెరుగుదలలో సహాయపడుతుంది.

జుట్టు ప్యాక్
* ఎరుపు మందార పువ్వు యొక్క ఆకులను తీసుకోని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ కి ఒక గుడ్డును కలపాలి.
* ఈ మిశ్రమాన్ని జుట్టుకు రాసి 20 నిముషాలు అలా వదిలేయాలి.
* జుట్టు నిర్మాణంలో సహాయపడటమే కాకుండా చుండ్రు తొలగించటంలో కూడా సహాయపడుతుంది.
* అలాగే తల మీద చర్మం తేమగా ఉండేలా చేస్తుంది.

జుట్టు ప్రక్షాళన
* రాత్రి సమయంలో మెంతులను నానబెట్టాలి. మరుసటి రోజు మెంతులు మరియు మందార పువ్వు ఆకులను కలిపి పేస్ట్ చేసి తలకు రాయాలి.
* జుట్టు నుండి మలినాన్ని తొలగించటమే కాకుండా చుండ్రు నివారణలో కూడా సహాయపడుతుంది.
* కొంత మంది జుట్టు జిడ్డు మరియు చెమట కారణంగా అతుక్కుపోయి ఉంటుంది. అటువంటి వారు ఈ ప్యాక్ వాడితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు.

జుట్టు షాంపూ
* ఎరుపు మందార పువ్వు రేకలను పేస్ట్ చేసి కలబంద జెల్ ని కలిపి షాంపూ వలే జుట్టుకు రాయాలి.
* జుట్టుకు పోషణను అందించటమే కాకుండా జుట్టును ప్రకాశవంతంగా మారుస్తుంది.
* మందార ఆకుల పేస్ట్ ని తలకు రాసినప్పుడు రక్త ప్రసరణ పెరుగుతుంది.
* ఈ మందార ఆకుల పేస్ట్ ని రిఫ్రిజిరేటర్ లో పెడితే ఒక వారం వరకు నిల్వ ఉంటుంది.

జుట్టు రంగు
* గోరింట పొడి, నీరు మరియు ఎరుపు మందార పువ్వు ఆకులను కలిపి హెన్నా ప్యాక్ ని తయారుచేయాలి.
* ఈ ప్యాక్ జుట్టుకు మంచి రంగుని ఇవ్వటమే కాకుండా మంచి పోషణను కూడా ఇస్తుంది.
* హెన్నా జుట్టును పొడిగా మారుస్తుంది.

బూడిద రంగు
* 200 ml కొబ్బరి నూనెలో 10 ఎరుపు మందార ఆకులు మరియు రేకలను వేసి మరిగించాలి.
* ఈ నూనె చల్లారిన తర్వాత జుట్టుకు రాయాలి.
* తెలుపు జుట్టు పెరుగుదల అగటమే కాకుండా జుట్టుకు పోషణ మరియు బలాన్ని ఇస్తుంది.