Kitchenvantalu

Capsicum Masala Curry :కాప్సికమ్ మసాలా కర్రీ రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లో సూపర్ గా ఉంటుంది

Capsicum Masala Curry :కాప్సికమ్ మసాలా కర్రీ రుచిగా ఇలా చేయండి.. రైస్, చపాతీ, పులావ్ లో సూపర్ గా ఉంటుంది..క్యాప్సికమ్ కర్రీ అనేది సులభమైన ప్రిపరేషన్‌తో కూడిన ఒక సాధారణ వంటకం.

కావలసిన పదార్దాలు
క్యాప్సికం – 2
ఉల్లిపాయలు – 2
టమాటాలు – 2
వెల్లుల్లి రేకలు -5 లేదా 6
అల్లం ముక్క – చిన్నది
జీలకర్ర – 1 స్పూన్
లవంగాలు – 4
పులావ్ ఆకు – 2
ధనియాలు – 1 స్పూన్
వేరు సెనగలు – 2 స్పూన్స్
నిమ్మ రసం – 1 స్పూన్
నూనె , ఉప్పు – తగినంత

తయారు చేసే విధానం
క్యాప్సికం ను ముక్కలుగా కోసుకోవాలి. వీటిని నూనెలో వేగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ధనియాలు, వేరుశనగలను నూనె లేకుండా వేయించి పొడి చేసుకోవాలి. టమోటా ముక్కలు,ఉల్లిపాయ ముక్కలు,అల్లం ముక్క,వెల్లుల్లి రెబ్బలు,జీలకర్ర,లవంగాలు,పులావ్ ఆకు లను మెత్తగా పేస్ట్ చేయాలి.

పొయ్యి మీద బాండి పెట్టి నూనె వేసి పేస్ట్ చేసిన మసాలా ముద్దను వేసి పచ్చి వాసన పోయే వరకు వేగించాలి. ఆ తర్వాత ధనియాలు, వేరుశనగల పొడి వేయాలి. కొంచెం వేగినాక క్యాప్సికం ముక్కలను వేసి వేగించాలి. ఈ మిశ్రమం కొంచెం దగ్గరకు వచ్చాక నిమ్మరసం పిండుకొని దించేయాలి.