Kitchenvantalu

carrot dosa:పిల్లలకి ఇలా టేస్టీ గా హెల్తీ గా క్యారెట్ దోశ చేసి పెట్టండి

carrot dosa:పిల్లలకి ఇలా టేస్టీ గా హెల్తీ గా క్యారెట్ దోశ చేసి పెట్టండి..పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పోషకాలు కూడా అందుతాయి.

కావలసిన పదార్దాలు
మినపగుండ్లు : 250 గ్రా
ఉప్పుడుబియ్యం/మామూలు బియ్యం : 500 గ్రా
కారట్ తురుము : 1 కప్పు
ఉల్లిపాయల తరుగు – 1 కప్పు
కొత్తిమీర తరుగు – 1/2 కప్పు
ఉప్పు:తగినంత
నూనె: వేయించటానికి సరిపడా

తయారు చేసే విధానం:-
ముందుగా బియ్యం,మినప గుండ్లను శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నానబెట్టి మెత్తగా రుబ్బుకోవాలి. దానికి తగినంత ఉప్పు వేసి కలిపిన అట్టుపిండిని రాత్రంతా నానబెట్టుకోవాలి.పిండి రాత్రంతా నాని వుంటే దోసెలు బాగా పొంగి రుచిగా వుంటాయి.

పెనం వేడి చేసి కొంచెం నూనె వేసుకుని,అట్టు వేసి ఇష్టమైన వాళ్ళు ఒక వైపు మాత్రమే దోసెను వేయించి రెండో వైపు,కారట్,ఉల్లిపాయలు,కొత్తిమీర, వేసి మూతపెట్టి స్టీం మీద కుక్ చేసుకోవచ్చు.

కొందరికి రెండో వైపు కూడా అట్టు క్రిస్పీగా కావాలనుకుంటే రెండు వైపులా దోసెను కాల్చుకుని, ఒక వైపు ఇలా కారట్,ఉల్లి,పచ్చిమిర్చి,కొత్తిమీర తరుగు వేసి ఉడికించుకోవచ్చు ..ఈ దోసెలను కారప్పొడి పల్లీల చెట్నీ తో తింటే బాగుంటాయి.