గోళ్లు కొరికే అలవాటు ఉందా…మిస్ కాకుండా చూడండి

గోళ్ళు కొరకడం అనేది చిన్నపిల్లలోనే కాదు ….. కొందరు పెద్దవారిలో కుడా కనపడుతూ ఉంటుంది. ఇది చెడ్డ అలవాటు అని తెలిసినా తెలియకుండానే గోళ్ళను కోరికేస్తూ ఉంటారు. దీనిని ఒక రుగ్మత అని చెప్పవచ్చు. గోళ్ళు కొరకటం అనేది మెదడు ప్రశాంతత కోల్పోయినప్పుడు జరిగే అసంకల్పిత చర్య. ఈ అలవాటు వలన మన శరీర ఆరోగ్యంతో పాటు చేతి వేళ్ళ అందం కూడా దెబ్బతింటుంది. ఈ అలవాటును మానివేయటానికి కొన్ని పద్దతులను తెలుసుకుందాము.

చూయింగ్ గమ్ నమలటం అలవాటు చేసుకుంటే మంచిది. నోటి నిండా ఏదైనా పదార్దం ఉంటే గోళ్ళు కొరకటానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అలవాటు ప్రకారం నోటిలో వేళ్ళు పెట్టుకున్నా
చూయింగ్ గమ్ కారణంగా ఆ పని సాధ్యపడక వేళ్ళను వెనక్కి తీసేసుకుంటాము.

గోళ్ళను నీట్ గా ట్రిమ్ చేసి పెయింట్ వేసుకోవటం వలన గోళ్ళ అందం పెరగటంతో పాటు,అందంగా,ఆకర్షణీయంగా కనపడే గోళ్ళను కోరకలేక ఆ ఆలోచనను వాయిదా వేసుకుంటాము.

మార్కెట్ లో కొన్ని రకాల పదార్దాలు లభ్యం అవుతున్నాయి. వాటిని నెయిల్ పాలిష్ లాగా అప్లై చేయాలి. గోళ్ళను కొరకటం ఉపక్రమించగానే వాటి రుచి మీకు వాంతి తెప్పించినట్ట్లై అసంకల్పితంగా గోళ్ళను కొరకటం అపివేస్తారు.

చేతులను ఖాళీగా ఉంచితేనే గోళ్ళు కొరకాలన్న కోరిక ఎక్కువ అవుతుంది. అలా కాకుండా ఎప్పుడూ ఏదో పనిలో చేతులను బిజీగా ఉంచితే గోళ్ళను కోరికే అవకాశం రాదు. కొన్ని రోజులు ఈ విధంగా చేస్తే క్రమేపి అలవాటును మానుకోవచ్చు.

బి విటమిన్,ఒమేగా 3ప్యాటి ఆహారం తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవటమే కాకుండా గోళ్ళను కోరికే అలవాటు నుంచి కూడా తప్పించుకోవచ్చు.