Beauty Tips

మందార పువ్వు లో ఉన్న బ్యూటీ ప్రయోజనాలు మీకు తెలుసా?

దాదాపుగా ప్రతి ఇంటిలోను మందార చెట్టు ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ పెరడు లేకపోయినా కుండీల్లో వేసుకుంటున్నారు. మందార పువ్వులను దేవునికి పెడతాం. చాలా మందికి బ్యూటీ ప్రయోజనాల గురించి తెలియదు. మందార పూలను బ్యూటీ ప్రయోజనాల కోసం ఎలా ఉపయోగించాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

మందార పువ్వులను తీసుకుని మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్టు లో పెరుగు కలిపి జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి. ఒక గంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే జుట్టు కి ఒక అద్భుతమైన కండిషనర్ గా పని చేయడమే కాకుండా జుట్టు మృదువుగా ఉండేలా చేస్తుంది. దురద మంట వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

మందార పువ్వులను పేస్ట్ గా చేసి దానిలో కలపాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి రెండు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి అరగంట తర్వాత తలస్నానం చేయాలి ఈవిధంగా వారంలో రెండుసార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు బలంగా ఆరోగ్యంగా ఉంటుంది.