Kitchen

ఆలు మటర్ కర్రీ

కావలసిన పదార్దాలు :

బంగాళాదుంపలు 1/2 కిలో
బటానీలు 1 /2 కప్పు
ఉల్లిపాయలు ౩
టొమాటో 1
అల్లం – వెల్లులి ముద్ద 1 చెంచా
ధనియాల పొడి 1 చెంచా
కారం 1/2 చెంచా
పంచదార కొంచెం
ఉప్పు, నెయ్యి సరిపడా
సోంపు 1 /2చెంచా
గరం మసాల 1 /2 చెంచా

తయారి విదానం :

బటాణి లను, బంగాళాదుంపలు విడివిడిగా కుక్కర్ లో ఉడికించి తీసి బంగాళాదుంపలు తోలు తీసి ముక్కలు చేసి ఉంచాలి. ఉల్లిముక్కలు చేసి కచ్చా పచ్చా గా మిక్సీ వేసి ఉంచాలి. టొమాటో లను వేడి నీటి లో ఉడికించి మిక్సీ వేయాలి. బాండి లో నెయ్యి వేసి కాగిన తరువాత సోంపు, అల్లం, వెల్లుల్లి ముద్ద వేసి వేపాలి. తర్వాత ఉల్లి ముద్ద వేసి టొమాటో రసం, గరం మసాల, కారం, ఉప్పు, పసుపు, పంచదార వేసి నెయ్యి పైకి తేలేంతవరకు వేపాలి. వేగిన వాసన వచ్చిన తర్వాత బటాణి, బంగాళాదుంప ముక్కలు వేసి కొంచెం నీళ్లు పోసి మసాల బాగా దగ్గరకు వచ్చిన తరువాత దించే ముందు కొత్తిమీర చల్లి దింపాలి. చివర లో కొంచెం క్రీం వేస్తె చాలా రుచిగా ఉంటుంది.