Health

నవ్వుతో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఏ పని అయిన మనం నేర్చుకునే చేస్తాము. కానీ నవ్వు మాత్రం ఎవరు నేర్పకుండానే వస్తుంది. ప్రతి మనిషి పుట్టిన తర్వాత రెండు మూడు నెలలకు నవ్వటం ప్రారంభించి,చనిపోయే వరకు ఏదో ఒక సందర్భంలో నవ్వుతూనే ఉంటారు. మనసారా నవ్వటం అనేది మనిషికి దేవుడు ఇచ్చిన వరం. నవ్వుతూ ఉండేవారు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా సమాజంలో గౌరవం కూడా లభిస్తుంది. నవ్వటం వలన కలిగే లాభాలు, నవ్వును ఏవిధంగా పెంపొందిచుకోవాలో తెలుసుకుందాము.

నవ్వుతూ ఉండటం వలన శారీరక ఆరోగ్యమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎదుటి వారితో సంబందాలు పెంపొందించేందుకు నవ్వు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే మనుషుల మధ్య దూరాన్ని తగ్గించి దగ్గర చేస్తుంది. ఒత్తిడి,ఆందోళన,కోపం తీవ్రతను తగ్గించటానికి నవ్వు చాలా బాగా ఉపయోగపడుతుంది. వ్యక్తులలో మార్పు తెచ్చే శక్తి నవ్వుకు ఉంది. రోజు మొత్తం మనసారా నవ్వటం వలన బిపి,షుగర్ వంటివి అదుపులో ఉంటాయి. నవ్వు అనేది ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ముఖ సౌందర్యాన్ని కూడా పెంచుతుంది. రోజులో కనీసం ఐదు లేదా పది నిముషాలు నవ్వటం వలన ముఖంలోని కండరాలకు మంచి వ్యాయామం అయ్యి ముడతలు తగ్గుతాయి.

జోక్స్ పుస్తకాలు చదవటం,వాటిని పదే పదే గుర్తుకు తెచ్చుకోవటం ద్వారా కూడా మనసారా నవ్వవచ్చు. కామెడి సినిమాలు,కార్టున్ నెట్వర్క్ లాంటివి పదే పదే చూడటం ద్వారా కూడా నవ్వును పెంపొందించుకోవచ్చు. ఇరుగు పొరుగు వారితో తరచూ మాట్లాడటం వలన వారితో సామజిక సంబందాలు మెరుగు అవ్వటమే కాకుండా,మాటల సందర్భంలో మనసారా నవ్వవచ్చు.