మన శరీరానికి విటమిన్ బి 6 ఎందుకు అవసరమో తెలుసా?

మన శరీరానికి అవసరమైన పోషకాల్లో బి6 ముఖ్యమైనది. నీటిలో కరిగే విటమిన్. శరీరంలో అనేక పనులకు ఈ విటమిన్ ఎంతగానో సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్ల మెటబాలిజమ్ ఎర్రరక్తకణాల ఉత్పత్తికి బి6 చాలా అవసరం. అయితే బి 6 విటమిన్ ని మన శరీరం తయారు చేసుకోలేదు. బి6 సమృద్ధిగా ఉన్న ఆహారాలు తీసుకోవాలి.

మన శరీరానికి అవసరమైన బి 6 సరిగా అందక పోతే చర్మంపై దద్దుర్లు పెదవులు పగలటం నాలుక పూత డిప్రెషన్ రోగనిరోధకశక్తి పనితీరు మందగించడం, నిస్సత్తువ తొందరగా అలసిపోవడం వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ సమస్య రాకుండా ఉండాలంటే బి6 చాలా అవసరం. ఈ విటమిన్ ఎక్కువగా చేపలు, పిస్తా పప్పు అరటిపండు అవకాడో చికెన్ పాలకూర వంటి ఆహారాలు సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకుంటే బి6 లోపం లేకుండా ఉంటుంది.

error: Content is protected !!