విజయ్ దేవరకొండ ఎంత పారితోషికం పెంచాడో తెలిస్తే షాక్ అవ్వాలసిందే

ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి హిట్టయిన నటులలో విజయ్ దేవరకొండ ఒకరు. తెలుగు సినిమాల్లో ఒకరకంగా రికార్డ్ క్రియేట్ చేశాడనే చెప్పాలి. అయితే ఈ పేరు ఒక్క రాత్రిలో వచ్చింది కాదు. దీని వెనక ఎన్నో సంవత్సరాల కష్టం ఉంది. చిన్న పాత్ర నుండి పెద్ద హీరో అయ్యే వరకు విశ్రాంతి లేకుండా శ్రమించాడు. పెళ్లి చూపులు సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఈ రేంజ్ కి వెళ్ళాడు. పెళ్లి చూపులు సినిమా గురించి పెద్దగా పబ్లిసిటీ లేకపోయినా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది దాంతో ఆ సినిమా హిట్ అయింది.

ఆ తర్వాత వచ్చిన ద్వారక ప్లాప్ అయింది. ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి రికార్డులు బద్దలు కొట్టడమే కాకుండా స్టార్ హీరో రేంజ్ కి తీసుకెళ్ళింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు విజయ్ 7 కోట్లు పారితోషికం తీసుకుంటున్నాడట.

error: Content is protected !!