సావిత్రి ఎత్తుకున్న ఈ చిన్నారి… టాలీవుడ్ స్టార్ హీరో…గుర్తు పట్టారా?

మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘మహానటి’ సినిమా విడుదల అయ్యి అభిమానుల ఆదరణ పొందింది. సినిమా విడుదల అయినా రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకొని సక్సెస్ గా ముందుకు సాగి సూపర్ హిట్ అయింది. సావిత్రికి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ఒక చిన్నబాబును సావిత్రి ఎత్తుకున్న ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆ ఫొటోలో ఉన్నది ఎవరంటూ ఆరా తీస్తే.. ఇప్పటి స్టార్ హీరోగా తెలిసింది.

ఇంతకు ఎవరా స్టార్ హీరో అంటే అక్కినేని నాగార్జున.అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా నటించిన ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో నాగార్జున చిన్న పిల్లాడి పాత్రలో నటించారు.ఆదుర్తి సుబ్బారావు గారి దర్శకత్వంలో ఈ సినిమా 1961 వ సంవత్సరంలో వచ్చింది.

error: Content is protected !!